News November 10, 2025
నేటి నుంచి గ్రూప్ -3 పోస్టులకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్

తెలంగాణలో నేటి నుంచి గ్రూప్-3 పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేపట్టనున్నారు. హైదరాబాద్ నాంపల్లిలోని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీలో ఈ నెల 26వరకు నిర్వహించనున్నారు. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5.30గంటల వరకు నిర్వహిస్తారు. అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు 2 జిరాక్స్ సెట్లు తీసుకెళ్లాలి.
Similar News
News November 10, 2025
తెలుగు సాహిత్య సంరక్షకుడు.. సీపీ బ్రౌన్

మన సంపదను దోచేసిన తెల్ల దొరలే కాదు.. మన సాహిత్యాన్ని కాపాడిన మనసున్న దొరలూ ఉన్నారు. వారిలో CP బ్రౌన్ ముందువరుసలో ఉంటారు. 1820లో ఉద్యోగిగా కడపకు వచ్చిన ఆయన జీవితాన్ని తెలుగు భాష, సాహిత్యం మార్చేసింది. అయితే అవన్నీ అంపశయ్యపై ఉన్నాయని తెలుసుకుని.. 30 ఏళ్లపాటు ఎన్నో గ్రంథాలు, తాళపత్రాలను ఒక్కచోటికి చేర్చారు. తొలి నిఘంటువునూ తీర్చిదిద్ది తెలుగువారి మదిలో సుస్థిర స్థానం సంపాదించున్న బ్రౌన్ జయంతి నేడు.
News November 10, 2025
ఆస్ట్రేలియాలో SM వాడకంపై ఆంక్షలు.. DEC నుంచి అమలు

16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా వినియోగంపై నిషేధం విధించనున్నట్లు ఆస్ట్రేలియా PM ఆంథోనీ ఆల్బనీస్ ప్రకటించారు. వారి ఆన్‌లైన్ సేఫ్టీ కోసమే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆన్‌లైన్ సేఫ్టీ అమెండ్‌మెంట్ బిల్-2024లోని ఈ కొత్త రూల్ డిసెంబర్ 10, 2025 నుంచి అమల్లోకి రానుంది. దీంతో టీనేజర్లు FB, ఇన్‌స్టా, టిక్‌టాక్, X, యూట్యూబ్ వంటి ప్లాట్‌ఫామ్స్‌లో అకౌంట్లు ఓపెన్ చేయడం, నిర్వహించడం చట్ట విరుద్ధం.
News November 10, 2025
చలి పులి దెబ్బ: ఇంటింటా దగ్గు, జలుబు శబ్దాలే!

ఒక్కసారిగా వాతావరణం మారడంతో ఇంట్లో ఒక్కరైనా జలుబు, దగ్గు, ఫ్లూ వంటి లక్షణాలతో బాధపడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ఈ వ్యాధులు వేగంగా వ్యాపిస్తున్నాయి. ఈక్రమంలో పిల్లలు, పెద్దలు స్వెటర్లు & వెచ్చని దుస్తులు ధరించడం ఉత్తమం. చల్లటి ఆహారాలు, పానీయాలకు దూరంగా ఉండండి. వేడి నీటితో ఆవిరి పట్టండి. సమస్య తీవ్రంగా ఉంటే స్వీయ వైద్యం చేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.


