News September 10, 2025
నేటి నుంచి చర్లపల్లిలో హాల్టింగ్

రానున్న పండగలు (దసరా, దీపావళి) ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని 12791/92 దానాపూర్-సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్ రైలు రాకపోకల్లో ఒక హాల్ట్ కల్పించారు. నేటి నుంచి ఈ రైలు తాత్కాలికంగా కొద్ది రోజుల పాటు చర్లపల్లిలో హాల్టింగ్ కల్పిస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ప్రతిరోజు నడిచే ఈ రైలు కాజీపేట, జమ్మికుంట, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి, సిర్పూర్ కాగజ్ నగర్ స్టేషన్లలో ఆగుతుందన్నారు.
Similar News
News April 13, 2026
IPL: లక్నోపై గుజరాత్ ఘనవిజయం

లక్నో వేదికగా LSGతో జరిగిన మ్యాచులో గుజరాత్ టైటాన్స్ 7 వికెట్ల తేడాతో గెలిచింది. 165 పరుగుల టార్గెట్‌ను 18.4 ఓవర్లలో ఛేదించింది. బట్లర్(60), గిల్ (56) రాణించారు. ఈ సీజన్‌లో GTకి ఇది రెండో విజయం కాగా లక్నోకు రెండో ఓటమి.
News April 13, 2026
BREAKING: టాస్ గెలిచిన ముంబై

వాంఖడే వేదికగా ఆర్సీబీతో జరగనున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ హార్దిక్ బౌలింగ్ ఎంచుకున్నారు.
News April 12, 2026
HYD: ఇంటర్ పాసైన విద్యార్ధులకు రూ.లక్ష వరకు SCHOLARSHIP

నేషనల్ స్కిల్ అకాడమీ ఆధ్వర్యంలో ఇంటర్ పాస్ అయిన విద్యార్థులకు కంప్యూటర్ ఎడ్యుకేషన్ మెరిట్ స్కాలర్‌షిప్ ప్రోగ్రాం కింద వివిధ కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ కోర్సులు ఆన్‌లైన్‌లో నేర్చుకునేందుకు రూ.లక్ష వరకు కోర్సు ఫీజులో రాయితీ ఇస్తున్నట్లు అకాడమీ డైరెక్టర్ అడప వెంకట్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్ మార్క్స్ గ్రేడింగ్ ఆధారంగా రూ.లక్ష వరకు స్కాలర్‌షిప్‌కు ఎంపిక చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. SHARE IT.


