News February 1, 2025
నేటి నుంచి జిల్లాలో పోలీసు యాక్ట్: ఎస్పీ
సంగారెడ్డి జిల్లాలో శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకుని నెల రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా 30,30(ఎ) పోలీసు యాక్ట్-1861 అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ తెలిపారు. పోలీసు అధికారుల ముందస్తు అనుమతి లేనిది జిల్లా ప్రజలు, ప్రజా ప్రతినిధులు ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లీక్ మీటింగ్‌లు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని సూచించారు.
Similar News
News February 1, 2025
రాష్ట్రపతి భవన్‌లో తొలి వివాహం
ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో పెళ్లి బాజాలు మోగనున్నాయి. రాష్ట్రపతి భవన్ పీఎస్ఓ, CRPF అసిస్టెంట్ కమాండెంట్ పూనమ్ గుప్తా, మరో CRPF అసిస్టెంట్ కమాండెంట్ అవ్నీశ్ కుమార్‌ల పెళ్లి జరగనుంది. ఈ గౌరవప్రదమైన వేదికపై ఒక అధికారి వివాహాన్ని నిర్వహించడం ఇదే మొదటిసారి. భవన్‌లోని మదర్ థెరెసా క్రౌన్ కాంప్లెక్స్‌లో ఈ వివాహ వేడుక జరగనుంది. వీరి పెళ్లికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రత్యేక అనుమతి మంజూరు చేశారు.
News February 1, 2025
గద్వాల: బైక్‌పై వెళ్తుండగా ఢీకొట్టి వెళ్లిపోయారు..!
జోగులాంబ గద్వాల జిల్లాలోని రాయచూర్ రోడ్డు మార్గంలో పార్చర్ల స్టేజీ సమీపాన ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. కేటీదొడ్డికి చెందిన బుడ్డ వీరన్న తన ద్విచక్రవాహనంపై వెళ్తున్నారు. ఈయనను ఓ గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందారు. మృతదేహాన్ని జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News February 1, 2025
గుర్ల: విద్యుత్ వైర్లు పట్టుకుని యువకుడి సూసైడ్
గుర్ల మండలంలో ఓ యువకుడు విద్యుత్ వైర్లు పట్టుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బిహార్ రాష్ట్రానికి చెందిన పులేషణ కుమార్ గుర్ల మండలం కోటగండ్రేడు రైస్‌మిల్లులో 2 నెలలుగా పనిచేస్తున్నాడు. శుక్రవారం రైస్‌మిల్ దగ్గర ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ వైర్లను పట్టుకున్నాడు. గమనించిన స్థానికులు విద్యుత్ సరఫరా నిలిపివేసి యువకుడిని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందగా SI నారాయణ కేసునమోదు చేశారు.