News July 7, 2024

నేటి నుంచి జిల్లా వ్యాప్తంగా ఆషాఢం బోనాలు

image

ఉమ్మడి కరీంగనగర్ జిల్లా వ్యాప్తంగా ఆదివారం నుంచి బోనాల సందడి ప్రారంభం కానుంది. వివిధ కుల సంఘాల ఆధ్వర్యంలో ఉత్సవాలు హోరెత్తనున్నాయి. నగునూరు దుర్గ భవాని ఆలయం, రామేశ్వర ఆలయం, మహా శక్తి ఆలయంలో ప్రత్యేక పూజలతో బోనాల వేడుకలు నిర్వహించనున్నారు. ప్రతి ఆషాఢ మాసంలో కుర్మ కులస్థులు పోచమ్మకు బోనాలు సమర్పిస్తుంటారు. డివిజన్ల వారీగా బోనాల పండగను జిల్లా ప్రజలు కలిసికట్టుగా చేసుకుంటారు.

Similar News

News February 8, 2026

KNR: మున్సిపల్ ఎన్నికలు.. ఫేక్ సర్వేలు!

image

మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగింపు దశకు చేరుకోవడంతో అభ్యర్థులు ఫేక్ సర్వేలకు తెరలేపుతున్నారు. కరీంనగర్ జిల్లాలో తమ పార్టీ గెలుస్తుందంటూ నకిలీ సర్వే ఫలితాలను ప్రచారం చేస్తూ ఓటర్లను ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తున్నారు. వాట్సాప్ గ్రూపుల ద్వారా ఈ సర్వేలను, విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. వాస్తవానికి వీటికి ఎలాంటి అధికారిక ఆధారాలు లేకపోవడంతో ఓటర్లు అప్రమత్తంగా ఉండాలని పలువురు సూచిస్తున్నారు.

News February 8, 2026

KNR: ముగింపు దశకు పుర పోరు.. హోరెత్తుతున్న ప్రచారం!

image

ఉమ్మడి KNRజిల్లాలోని మున్సిపల్ ఎన్నికల వేడి పతాక స్థాయికి చేరింది. సోమవారం సా.5గంటలకు ప్రచారం ముగియనుండడంతో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, BJP, BRS అభ్యర్థులు గల్లీ గల్లీ తిరుగుతూ ఓటర్ల మద్దతు కూడగట్టుకుంటున్నారు. అభ్యర్థుల గెలుపు కోసం రాష్ట్ర స్థాయి అగ్రనేతలు సైతం రంగంలోకి దిగి బహిరంగ సభలు, రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. స్థానిక సమస్యల కంటే ఎక్కువగా రాజకీయ విమర్శలు,ప్రతివిమర్శలతో హాట్ హాట్ గా మారింది.

News February 7, 2026

KNR: సర్కారు దవాఖానల్లో ప్రసవాలు పెంచాలి: కలెక్టర్

image

ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలను మరింత మెరుగుపరచాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. కరీంనగర్‌లో సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. పీహెచ్‌సీల్లో ప్రసవాల సంఖ్య పెంచాలని, సాధారణ ప్రసవాలకే మొగ్గు చూపాలని సూచించారు. గర్భిణులకు ఉచిత పరీక్షలు, మందులపై అవగాహన కల్పించాలన్నారు. చిన్నారులకు టీకాల పంపిణీలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.