News September 22, 2025

నేటి నుంచి తగ్గనున్న విశాఖ డెయిరీ పాల ధరలు

image

ఇటీవల సవరించిన జీఎస్టి రేట్లతో పాలు, పాల ఉత్పత్తుల ధరలు తగ్గనున్నాయని విశాఖ డెయిరీ యాజమాన్యం ప్రకటించింది. ఈ కొత్త ధరలు నేటి నుంచి అమల్లోకి వస్తాయని వెల్లడించింది. విశాఖ డెయిరీలో మొత్తం 188 ఉత్పత్తుల్లో 94 ఉత్పత్తుల గరిష్ఠ అమ్మక ధరలు తగ్గనున్నాయి. పాలు లీటరుకు రూ.2 నుంచి రూ.3 వరకు తగ్గనుంది. పనీర్ కేజీ ప్యాకెట్ ధర రూ.20, నెయ్యి కేజీకి రూ.42, బట్టర్ రూ.40 వరకు తగ్గనున్నాయి.

Similar News

News September 22, 2025

NLG: సమృద్ధిగా వర్షాలు.. చేప పిల్లల పంపిణీలో జాప్యం

image

ఈ ఏడాది జిల్లాలో సమృద్ధిగా వర్షాలు కురిసి, జలాశయాలు నిండుగా ఉన్నాయి.. చేప పిల్లల పంపిణీకి వాతావరణం అనుకూలంగా ఉన్నప్పటికీ, ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా పంపిణీ ఆలస్యమవుతోంది. దీంతో మత్స్యకార్మిక కుటుంబాలు తీవ్రంగా నష్టపోతున్నాయి. జిల్లాలో మొత్తం 260 మత్స్యపారిశ్రామిక సహకార సంఘాలు ఉన్నాయి. అయితే, ఉచిత చేప పిల్లల పంపిణీపై ప్రభుత్వ నిర్ణయం తీసుకోవడంలో జాప్యం వల్ల టెండర్ల ప్రక్రియ ఆలస్యంగా ప్రారంభమైంది.

News September 22, 2025

GNT: దర్శనం టికెట్ల కౌంటర్ కోసం QR కోడ్

image

విజయవాడ కనకదుర్గమ్మ దేవస్థానంలో దసరా మహోత్సవం సందర్భంగా భక్తుల సౌలభ్యం కోసం కొత్త సదుపాయం అందుబాటులోకి వచ్చింది. టికెట్ కౌంటర్లకు సులభంగా చేరుకునేందుకు ప్రత్యేకంగా QR కోడ్ స్కానర్లు ఏర్పాటు చేశారు. భక్తులు స్కాన్ చేస్తే లొకేషన్‌ల జాబితా మొబైల్‌లో ప్రత్యక్షమై, కావలసిన స్థలాన్ని ఎంచుకుని గూగుల్ మ్యాప్ ద్వారా సులభంగా చేరుకోవచ్చు. భక్తులు ఈ సౌకర్యాన్ని వాడుకొని సులభంగా అమ్మవారి దర్శనం చేసుకోవచ్చు.

News September 22, 2025

తాటిపర్తి చెరువు దగ్గర కార్ బోల్తా

image

పొదలకూరు మండలం తాటిపర్తి చెరువు వద్ద ఇవాళ తెల్లవారుజామున కారు బోల్తా పడింది. సబ్ స్టేషన్‌లో పని చేస్తున్న సిబ్బంది కారు డ్రైవర్‌ని బయటకి తీసి కాపాడారు. ఆతనికి స్వల్ప గాయాలు అయ్యాయి. పొదలకూరు నుంచి సంగం వైపుగా వెళ్తున్న కారు అక్కడ రోడ్డుపై పోసిన వడ్ల రాశిని ఎక్కించడంతో బోల్తా పడినట్లు స్థానికులు తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.