News September 27, 2025
నేటి నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు

నేటి నుంచి జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు. సహకార సంఘాల ఆధ్వర్యంలో వరి కోత కోసే ప్రతి గ్రామంలో ఈ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గ్రేడ్ – ఏ పుట్టి రూ. 20,306, సాధారణ రకం పుట్టి రూ. 20,136 ప్రభుత్వ మద్దతు ధరగా ప్రకటించినట్లు తెలిపారు.
Similar News
News September 27, 2025
నెల్లూరు: విధులకు రాకున్నా.. పక్కాగా జీతం !

గతంలో DMHO గా పనిచేసిన పెంచలయ్య హయాంలో కృష్ణాపురం PHC కి చెందిన ఓ వైద్యాధికారి 2022లో పీజీ కోర్సు చదివేందుకు వెళ్లారు. అప్పట్నుంచి ఆయన విధులకు హాజరువ్వకుండానే దాదాపు రెండేళ్లకు పైగా ప్రతీ నెల జీతం డ్రా చేసినట్లు సమాచారం. గత DMHO పట్టించుకోకపోవడంపై పలు విమర్శలు వస్తున్నాయి. తాజాగా దీనిపై విచారణ అధికారిని సైతం ప్రభుత్వం నియమిస్తూ జీవోను విడుదల చేయడం గమనర్హం. ఏమి జరుగుతుందో వేచి చూడాలి.
News September 27, 2025
నెల్లూరులో నకిలీ సైబర్ క్రైమ్ సీఐ అరెస్ట్

ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగులను మోసం చేసిన నకిలీ క్రైమ్ బ్రాంచ్ సీఐ సాయికృష్ణతో పాటు అతని తండ్రి పోలయ్యను వేదయపాలెం పోలీసులు అరెస్టు చేశారు. శివాజీ నగర్‌లో నివాసముంటున్న సాయికృష్ణ విజయవాడ సైబర్ క్రైమ్‌లో సీఐ అంటూ పలువురిని నమ్మించాడు. న్యూ మిలిటరీ కాలనీకి చెందిన వినోద్ కుమార్ దగ్గర రూ.11లక్షలు తీసుకుని మోసం చేశాడు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అరెస్ట్ చేశారు.
News September 27, 2025
DSC జాబితాలో అభ్యంతరాలు ఉంటే తెలపండి: DEO

2025 DSC ఎంపిక జాబితాను వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచామని, అభ్యంతరాలు ఉంటే తెలపాలని జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ ఆర్ బాలాజీ రావు ఒక ప్రకటనలో తెలిపారు. జాబితాలో అభ్యంతరాలు ఫిర్యాదులు ఉంటే అక్టోబర్ 25వ తేదీల్లోగా జోన్, రాష్ట్ర స్థాయి గ్రీవెన్స్‌లో తెలియజేయాలని, వాటి పరిష్కారానికి అవకాశం ఉందన్నారు.