News November 27, 2025

నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ

image

TG: పంచాయతీ ఎన్నికల తొలి విడత నామినేషన్ల స్వీకరణ నేడు ప్రారంభమై 3 రోజుల పాటు సాగనుంది. ఈ నెల 30న స్క్రూటినీ చేయనుండగా, DEC 3 వరకు విత్ డ్రాకు అవకాశం ఉంది. తొలి విడతలో 4,236 సర్పంచ్.. 37,440 వార్డు స్థానాలకు DEC 11న పోలింగ్ జరగనుంది. అటు నామినేషన్ల స్వీకరణకు జిల్లా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లుగా గెజిటెడ్ హోదా కలిగిన అధికారులను నియమించారు.

Similar News

News November 28, 2025

మూవీ ముచ్చట్లు

image

* Netflixలో స్ట్రీమింగ్‌ అవుతున్న హీరో రవితేజ ‘మాస్ జాతర’
* రిలీజైన వారంలోనే అమెజాన్ ప్రైమ్‌లోకి వచ్చేసిన రాజ్ తరుణ్ ‘పాంచ్ మినార్’ మూవీ
* నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చేసిన తమిళ హీరో విష్ణు విశాల్ ‘ఆర్యన్’ చిత్రం.. తెలుగులోనూ స్ట్రీమింగ్
* బాక్సాఫీస్ వద్ద గుజరాతీ చిత్రం ‘లాలో కృష్ణా సదా సహాయతే’ రికార్డులు.. రూ.50 లక్షలతో నిర్మిస్తే 49 రోజుల్లో రూ.93 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్

News November 28, 2025

పాత ఫొటోలకు కొత్త రూపం.. ట్రై చేయండి!

image

పాడైపోయిన, క్లారిటీ కోల్పోయిన చిన్ననాటి ఫొటోలను HD క్వాలిటీలోకి మార్చుకోవచ్చు. ‘జెమినీ AI’ను ఉపయోగించి అస్పష్టంగా ఉన్న చిత్రాలను అప్‌లోడ్ చేసి, సరైన ప్రాంప్ట్‌తో డిజిటల్ SLR నాణ్యతకు మార్చవచ్చు. ఇది గీతలు, మసకబారడం వంటి లోపాలను సరిచేస్తూ, రూపురేఖలను చెక్కుచెదరకుండా ఉంచి, మీ జ్ఞాపకాలను సజీవంగా అందిస్తుంది. ఈ <>ప్రాంప్ట్<<>> వాడి మీరూ ట్రై చేయండి.

News November 28, 2025

పీసీఓఎస్ ఉందా? ఇలా చేయండి

image

పీసీఓఎస్ ఉన్నవారిలో ప్రధాన సమస్య బరువు. ఎంత కడుపు మాడ్చుకున్నా, వ్యాయామాలు చేసినా బరువు తగ్గడం చాలా కష్టంగా ఉంటుంది. అలాంటివారు ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవాలంటున్నారు నిపుణులు. పులియబెట్టిన ఆహారాలు, ఫైబర్, ప్రొటీన్ ఫుడ్స్ డైట్‌లో చేర్చుకోవాలి. అవకాడో, ఆలివ్‌ నూనె, కొబ్బరి నూనె, నట్స్‌.. వంటి ఆరోగ్యకరమైన కొవ్వులు కడుపు నిండుగా ఉండేలా చేస్తాయి. వీటితో పాటు వ్యాయామాలు, తగినంత నిద్ర ఉండాలి.