News March 26, 2024
నేటి నుంచి నావికా దళ విన్యాసాలు

నేటి నుంచి కాకినాడ సాగరతీరంలో భారత్- అమెరికా దేశాల సంయుక్త నావికా దళ విన్యాసాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ ఎస్.సతీష్‌కుమార్ తెలిపారు. స్థానిక సూర్యారావుపేట నేవెల్ ఎన్‌క్లేవ్ ప్రాంతంలో నిర్వహించనున్న టైగర్ ట్రంప్ విన్యాసాల ఏర్పాట్లను ఎస్పీ పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు. నేవెల్ ఎన్‌క్లేవ్ పరిధిలో ఆరు రోజుల పాటు నేవీ, ఆర్మీ అధికారులు సంయుక్తంగా విన్యాసాలు నిర్వహిస్తాయన్నారు.
Similar News
News September 28, 2025
గోకవరంలో స్వల్పంగా తగ్గిన చికెన్ ధరలు

గోకవరంలో ఆదివారం చికెన్ దుకాణాలు కొనుగోలుదారులతో రద్దీగా కనిపించాయి. మాంసం, చేపలు, రొయ్యలు, పీతల ధరలు స్వల్పంగా పెరిగాయి. బ్రాయిలర్ చికెన్ కిలో రూ.210-230, నాటుకోడి మాంసం రూ.700, మేక మాంసం రూ.800, వరకు ధరలు పలికాయి. దసరా ఉత్సవాలు జరుగుతున్నందున చాలా మంది భవాని మాలలు వేయడంతో చికెన్ ధరలు స్వల్పంగా తగ్గాయని వ్యాపారస్తులు అంటున్నారు. మీ ప్రాంతంలో చికెన్ ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.
News September 28, 2025
రాజమండ్రి: లోతట్టు ప్రాంతాలను పరిశీలించిన కలెక్టర్

రాజమండ్రిలోని పలు లోతట్టు ప్రాంతాలను జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి శనివారం సందర్శించారు. ఆల్కాట్ గార్డెన్, గౌతమీ ఘాట్ వద్ద కొన్ని కుటుంబాలు ముంపుకు గురయ్యే అవకాశం ఉన్నట్లు గుర్తించారు. లోతట్టు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు యంత్రాంగం సిద్ధంగా ఉందని కలెక్టర్ సూచించారు. వర్షాలు కురవడంతో జిల్లాలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ తెలిపారు.
News September 28, 2025
విద్యార్దులకు ఆఫర్ లెటర్స్ పంపిణీ

తూర్పు గోదావరి జిల్లా కలెక్టరేట్‌లో ‘వికాస’ ఆధ్వర్యంలో నిర్వహించిన మినీ జాబ్ మేళాలో ఎంపికైన అభ్యర్థులకు కలెక్టర్ కీర్తి చేకూరి శనివారం రాజమండ్రిలోని కలెక్టరేట్‌లో ఆఫర్ లెటర్లు అందజేశారు. ఈ జాబ్ మేళాలో 150 మంది విద్యార్థులు పాల్గొన్నారు. అందులో 107 మంది ఎంపికయ్యారని వికాస ప్రాజెక్ట్ డైరెక్టర్ కె.లచ్చారావు తెలిపారు.