News April 1, 2025

నేటి నుంచి నెలపాటు APRIL పూల్..

image

ఏప్రిల్ 1 వచ్చిందంటే ఒకరిని ఒకరు పూల్స్ చేసుకుని సరదా పడుతూ ఉంటారు. లేనిది ఉన్నట్టు చెప్పి ఉన్నది లేనట్లు చెప్పి, యథాలాపంగా ఉన్నవారు అవాక్కయ్యే తరుణంలో ఏప్రిల్ ఫూల్ అని ఆట పట్టించేవారు. 2000 సంవత్సరం జనరేషన్ వరకు ఈ ఏప్రిల్ ఫూల్ బాగా ప్రాచుర్యంలో ఉండేది. ప్రస్తుతం మారిన కాలంతో పాటు చిన్న, పెద్దల్లో కూడా ఆటలు, ముచ్చట్లు లేవనే చెప్పుకోవాలి. మీకూ ఇటువంటి సన్నివేశం ఎప్పుడైనా ఎదురైందా.. కామెంట్ చేయండి

Similar News

News September 16, 2025

జనగామ జిల్లా పర్యావరణ పరిరక్షణ బ్రాండ్ అంబాసిడర్‌గా గౌసియా బేగం

image

జనగామ జిల్లా పర్యావరణ పరిరక్షణకు బ్రాండ్ అంబాసిడర్‌గా GCDO గౌసియా బేగంను నియమిస్తూ తెలంగాణ రాష్ట్ర హరితదల డైరెక్టర్ WC ప్రసన్నకుమార్ నియామకపత్రం జారీచేశారు. ఈ మేరకు అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్ గౌసియా బేగంకు అందజేశారు. ఈ సందర్భంగా అమెను అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. గౌసియా బేగం మాట్లాడుతూ.. తనకు అప్పగించిన బాధ్యతను శ్రద్ధగా నిర్వర్తించి, పర్యావరణ జిల్లాకు కృషి చేస్తానని తెలిపారు.

News September 16, 2025

గన్నవరం ఎయిర్ పోర్టులో రేపు ప్రయాణికులకు గ్రాండ్ వెల్కం

image

గన్నవరం విమానాశ్రయంలో ప్రధాని మోదీ పుట్టినరోజు సందర్బంగా యాత్రిసేవా దివస్‌ను బుధవారం నిర్వహించబోతున్నారు. ప్రయాణికులకు క్వాలిటీ సర్వీసెస్‌ అందించడంలో భాగంగా వారికి గ్రాండ్‌గా వెల్కం చేయడం, వైద్య పరీక్షల నిర్వహణ, విద్యార్థులకు ఎయిర్‌పోర్టు చూపించడం, ఏవియేషన్ రంగంలో ఉద్యోగావకాశాల కల్పనపై తరగతులు ఏర్పాటు చేయనున్నారు. ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని చర్యలు తీసుకోనున్నారు.

News September 16, 2025

భార్య చివరి కోరిక నెరవేర్చిన భర్త

image

AP: తనను ఉపాధ్యాయుడిగా చూడాలన్న భార్య చివరి కోరికను తీర్చాడు భర్త. ఎన్టీఆర్(D) రెడ్డికుంటకు చెందిన రామకృష్ణ భార్య ఏడాది క్రితం డెంగీతో మరణించారు. ఇటీవల ఫలితాల్లో స్కూల్ అసిస్టెంట్‌(బయాలజీ)గా DSCలో ఎంపికయ్యారు. ఆమె చివరి కోరికను తీర్చడానికి రోజుకు 10 గంటలకు పైగా చదివినట్లు రామకృష్ణ తెలిపారు. తన భార్య బతికి ఉంటే సంతోషించేదని ఆయన కన్నీటి పర్యంతమయ్యారు.