News March 21, 2025
నేటి నుంచి పది పరీక్షలు..36 కేంద్రాలు

ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా పదో తరగతి వార్షిక పరీక్షల కోసం మొత్తం 36 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈనెల 21 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యాశాఖ ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం 6,421 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఇందులో రెగ్యులర్ విద్యార్థులు బాలురు 2,894, బాలికలు 3,527, మొత్తం 6,421మంది ఉన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద బీఎన్ఎస్163 సెక్షన్ అమలు చేయనున్నట్లు చెప్పారు.
Similar News
News November 11, 2025
ఆదిలాబాద్‌లో నేటి పత్తి ధర వివరాలు

ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయి. మార్కెట్‌లో మంగళవారం సీసీఐ పత్తి ధర క్వింటాల్ రూ.8,110గా, ప్రైవేట్ పత్తి ధర రూ.6,750గా నిర్ణయించారు. సోమవారం ధరతో పోలిస్తే మంగళవారం సీసీఐ ధరలో ఎలాంటి మార్పులేదు. ప్రైవేటు ధర రూ.50 తగినట్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు తెలియజేశారు.
News November 11, 2025
భద్రాద్రి సుదర్శన చక్రానికి 352 ఏళ్లు

భద్రాచలం సీతారామచంద్ర స్వామి ఆలయం గోపురంపై ఉన్న సుదర్శన చక్రానికి విశిష్ట చరిత్ర ఉంది. కంచర్ల గోపన్న (భక్త రామదాసు) ఆలయ నిర్మాణం పూర్తవుతున్న 1674-1675 మధ్య కాలంలో శ్రీరాముడి ఆజ్ఞ మేరకు గోదావరిలో స్నానం చేస్తుండగా ఈ సుదర్శన చక్రం లభించింది. ఆనాటి నుంచి నేటి వరకు (352 ఏళ్లు) ఆలయ గోపురంపై ఇది కొనసాగుతోంది. ఈ చారిత్రక ఘట్టాన్ని భక్తులు స్మరించుకుంటున్నారు.
News November 11, 2025
జడ్పీటీసీ హత్య కేసులో మరో నిందితుడు అరెస్ట్: ఎస్సై

కొయ్యూరు మండల జడ్పీటీసీ వారా నూకరాజు హత్య కేసులో మరో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత నెల 20న MK పట్నం వెలుపల భూ వివాదంలో ఉద్రిక్తతలో దారితీసిన దాడిలో నూకరాజు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఏడుగురిని రిమాండ్‌కు పంపించిన విచారణ బృందం, మరో నిందితుడు మారా నూకరాజును సోమవారం అరెస్ట్ చేసి న్యాయస్థానానికి అప్పగించినట్లు రోలుగుంట ఎస్సై రామకృష్ణారావు వివరించారు.


