News December 21, 2025

నేటి నుంచి పల్స్ పోలియో..1,707 కేంద్రాలు సిద్దం: కలెక్టర్

image

ఏలూరు జిల్లాలో ఈనెల 21 నుంచి 23 వరకు నిర్వహించే పల్స్ పోలియోను విజయవంతం చేయాలని కలెక్టర్ వెట్రిసెల్వి అన్నారు. ఐదేళ్లలోపున్న 2.04 లక్షల మంది చిన్నారులకు చుక్కలు వేయడమే లక్ష్యంగా 1,707 కేంద్రాలను సిద్ధం చేశామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 1.49 లక్షలు, పట్టణాల్లో 29 వేలు, గిరిజన ప్రాంతాల్లో 20 వేల మంది చిన్నారులు ఉన్నట్లు గుర్తించామని, తల్లిదండ్రులు తమ పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలన్నారు.

Similar News

News December 22, 2025

తూ.గో: బ్యాగు నుంచి సౌండ్.. ప్రయాణికుల పరుగులు

image

నిడదవోలు-భీమవరం ప్యాసింజర్ రైలులో ఆదివారం ఓ బ్యాగు కలకలం సృష్టించింది. సీటు కింద ఉన్న సంచి నుంచి బీప్ సౌండ్ రావడంతో ప్రయాణికులు బాంబుగా భావించి పరుగులు తీశారు. సమాచారం అందుకున్న ఆర్పీఎఫ్ పోలీసులు బ్యాగును తనిఖీ చేయగా, అందులో ‘ఫోన్ పే’ సౌండ్ బాక్స్, బిర్యానీ ప్యాకెట్, దుస్తులు ఉన్నట్లు గుర్తించారు. దొంగతనం చేసిన వ్యక్తి ఆ బ్యాగును రైలులో వదిలి వెళ్లి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

News December 22, 2025

యూరియా బుకింగ్ ఇక యాప్‌తో మాత్రమే

image

TG: యూరియా పొందాలంటే రైతులు నేటి నుంచి Fertilizer Booking Appతో మాత్రమే బుక్ చేసుకోవాలి. ఈనెల 20 నుంచి కొన్ని జిల్లాల్లో ఈ విధానం అందుబాటులోకి రాగా, రాష్ట్ర వ్యాప్తంగా ఇకపై ఇదే విధానం అమలుకానుంది. పారదర్శకంగా, నిజమైన లబ్ధిదారులకే యూరియా పంపిణీకి ఈ విధానం తెచ్చామని ప్రభుత్వం తెలిపింది. యాప్ ద్వారా యూరియా ఎలా బుక్ చేసుకోవాలి?, ఏ పంటకు ఎన్ని బస్తాలు ఇస్తారో తెలుసుకోవడానికి <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.

News December 22, 2025

YS జగన్‌ ఫ్లెక్సీకి రక్తాభిషేకం

image

అనంతపురం జిల్లాలో మాజీ సీఎం YS జగన్ బర్త్ డే సంబరాలు చర్చనీయాంశంగా మారాయి. విడపనకల్లులో వైసీపీ నేతలు వేట కొడవళ్లతో పొట్టేళ్లను నరికి రక్తంతో జగన్ ఫ్లెక్సీలకు అభిషేకం చేశారు. కనగానపల్లి మండలం భానుకోటలో సైతనం ఇదే తరహా సంబరాలు చేసుకున్నారు. ఫ్యాక్షన్‌ గ్రామమైన భానుకోటలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. 2029లో రప్పా రప్పా అని ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి పొట్టేళ్లను బలితీయడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి.