News June 24, 2024

నేటి నుంచి పాఠశాలల్లో విద్యా ప్రవేశం: డీఈవో

image

జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో సోమవారం నుంచి నాలుగు వారాల పాటు విద్యాప్రవేశం కార్యక్రమం అమలు జరుగుతుందని డీఈవో డి.సుభద్ర పేర్కొన్నారు. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు రాష్ట్ర సమగ్రశిక్ష సంస్థ ఈ కార్యక్రమం చేపట్టిందన్నారు. ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు నూరుశాతం విద్యార్థుల నమోదు చేయించాలన్నారు. పర్యవేక్షణ కోసం దీక్ష యాప్‌ను వినియోగించుకోవాలన్నారు

Similar News

News February 26, 2026

మార్కాపురంలో సీఎంను ఆకట్టుకున్న విద్యార్థిని చిత్రలేఖనం

image

మార్కాపురం బహిరంగ సభలో ఓ విద్యార్థిని గీసిన చిత్రలేఖనం సీఎం చంద్రబాబును ప్రత్యేకంగా ఆకట్టుకుంది. మార్కాపురం జిల్లా చెన్నకేశవ స్వామి గోపురం, సీఎం చిత్రాల అందంగా ఉండడంతో విద్యార్థినిని సీఎం అభినందించారు. ఈ చిత్రలేఖనంలో చాలా అర్థం దాగి ఉందని ప్రజలకు వివరించారు. ఆ దేవుడితో పెట్టుకుంటే పతనం ఖాయమని హెచ్చరించారు.

News February 26, 2026

వెలిగొండ పూర్తయితే 3 జిల్లాలకు ప్రయోజనం

image

కడప, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు సాగు, తాగునీరు అందించేందుకు వెలిగొండ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటుంది. 43.5 TMCల వరద నీటిని నల్లమల్లసాగర్ రిజర్వాయర్ ద్వారా మళ్లించి 19.2 కిలోమీటర్ల పొడవైన టన్నెల్స్‌తో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు, 15 లక్షల మందికి తాగునీరు అందించేలా రూపొందించారు. ఈ ప్రాజెక్టును కూటమి ప్రభుత్వం వేగవంతం చేసి 2026కి పూర్తిచేస్తామని CM చంద్రబాబు పూనుకున్నారు.