News June 1, 2024

నేటి నుంచి బాసర ట్రిపుల్ఐటీలో దరఖాస్తుల స్వీకరణ

image

బాసర ట్రిపుల్ఐటీలో 2024-25 విద్యాసంవత్సరానికి శనివారం నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు VC వెంకట రమణ తెలిపారు. ఈ ఏడాది ఆన్‌లైన్ దరఖాస్తు విధానాన్ని ఎస్సెస్సీ బోర్డు సర్వర్‌తో అనుసంధానం చేసినట్లు వెల్లడించారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థి హాల్‌టికెట్ నంబర్, పేరు తదితర వివరాలు ఆటోమేటిక్‌గా కనిపిస్తాయన్నారు. జూన్ 1నుంచి 22 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.

Similar News

News September 29, 2024

ఆదిలాబాద్: పల్లె ఓటర్ల లెక్క తేలింది

image

గ్రామ పంచాయతీల్లోని ఓటర్ల లెక్క తేలింది. సర్పంచ్, వార్డుసభ్యుల ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పంచాయతీల్లో వార్డుల వారీగా సిద్దం చేసిన ఫొటోలతో కూడిన ఓటర్ల తుది జాబితాను పంచాయతీ శాఖ అధికారులు శనివారం ప్రకటించారు. జిల్లాలోని 17 మండలాల్లో గల 473 గ్రామ పంచాయతీల పరిధిలో 4,41,795 మంది ఓటర్లు ఉన్నట్లుగా వెల్లడించారు. ఇందులో పురుషులతో పోల్చితే మహిళా ఓటర్లే అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది.

News September 29, 2024

ADB: మూడేళ్ల బాలికపై అత్యాచారయత్నం

image

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. పట్టణంలోని ఒక కాలనీలో 3 సంవత్సరాల బాలికపై 45 ఏళ్ల వ్యక్తి అత్యాచారయత్నం చేశాడు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆదిలాబాద్ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ జీవన్ రెడ్డి తెలిపారు.

News September 29, 2024

ఆసిఫాబాద్: ‘రాజీ మార్గమే రాజా మార్గం’

image

రాజీ మార్గమే రాజా మార్గమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంవి.రమేష్ అన్నారు. శనివారం ఆసిఫాబాద్ పట్టణంలోని కోర్టు ఆవరణలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలతో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లోక్ అదాలత్ ద్వారా కేసులను రాజీమార్గం ద్వారా పరిష్కరించుకోవచ్చని తెలిపారు. ఈ సందర్భంగా కేసులను అక్కడికక్కడే పరిష్కరించినట్లు ఆయన తెలిపారు.