News November 25, 2025
నేటి నుంచి మల్దకల్‌లో తిమ్మప్ప బ్రహ్మోత్సవాలు

స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి (తిమ్మప్ప) ఆలయంలో మంగళవారం నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నట్లు ఆలయ ఛైర్మన్ పట్వారి ప్రహ్లాద రావు తెలిపారు. బ్రహ్మోత్సవాల ప్రారంభానికి మంత్రాలయం పీఠాధిపతులు శ్రీ సుబుధేంద్ర తీర్థ స్వామీజీ హాజరు కానున్నారని ఆయన పేర్కొన్నారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు పూర్తయ్యాయి.
Similar News
News November 26, 2025
HYDను అంతర్జాతీయ పెట్టుబడుల హబ్‌గా నిలపాలి: సీఎం

హైదరాబాద్‌ను అంతర్జాతీయ పెట్టుబడుల హబ్‌గా నిలపాలని ‘తెలంగాణ రైజింగ్’ గ్లోబల్ సమ్మిట్‌ను విజయవంతం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రానికి ఉన్న రోడ్డు నెట్‌వర్క్, పోర్ట్ కనెక్టివిటీ, సంస్కృతి, వాతావరణం వంటి అనుకూలతలను ప్రపంచానికి చాటాలన్నారు. అలాగే రామప్ప నుంచి సమ్మక్క- సారక్క, నల్లమల్ల పులులు, తెలంగాణ ప్రముఖులు- అన్నీ రాష్ట్ర బ్రాండింగ్‌లో ప్రతిఫలించాలని సూచించారు.
News November 26, 2025
ప్రపంచంలోని టాప్-100 బెస్ట్ సిటీల్లో హైదరాబాద్!

ప్రతిష్ఠాత్మక ‘2026 World’s Best Cities Report’లో ఇండియా నుంచి 4 నగరాలు ప్రపంచంలోని టాప్-100 జాబితాలో చోటు దక్కించుకున్నాయి. 29వ స్థానంతో బెంగళూరు నగరం అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో ఆర్థిక కేంద్రంగా ముంబై (40), పరిపాలన & మౌలిక సదుపాయాలకు ఢిల్లీ (54), ఐటీ రంగ సేవలకు గాను హైదరాబాద్ 82వ స్థానంలో నిలిచింది. జీవన సౌకర్యాలు, అభివృద్ధి వంటి అంశాలను ఆధారంగా తీసుకొని ఈ ర్యాంకులిచ్చారు.