News December 16, 2025
నేటి నుంచి మహిళా సంఘాలు బడ్జెట్‌పై శిక్షణ ప్రారంభం

మహిళా సంఘాలు బడ్జెట్ ప్రణాళికపై 16వ తేదీ నుంచి 19వ తేదీ వరకు 6 మండలాలు వారికి రాజవొమ్మంగి మండల మహిళా సమైక్య కార్యాలయం శిక్షణ కొనసాగుతుందని APM రామాంజనేయులు తెలిపారు. రాజవొమ్మంగి, నెల్లిపాక, గూడెం కొత్తవీధి, దేవిపట్నం, వి.ఆర్.పురం, అరకు వేలి APMలు, సీసీలు, ఎల్ సీసీ, అకౌంటెంట్లు తప్పనిసరిగా హాజరుకావాలన్నారు.
Similar News
News December 16, 2025
ఆరోగ్యం, ఐశ్వర్యం తిరిగి పొందేందుకు..

అశాంతి, అనారోగ్యం, ఐశ్వర్య నష్టం మిమ్మల్ని వేధిస్తున్నాయా? అయితే పరమేశ్వరుడిని ప్రసన్నం చేసే రుద్రహోమం మీకు సరైనది. ఇందులో శ్రీరుద్రం, శివ పంచాక్షరి వంటి మంత్రోచ్ఛారణలతో పాటు పరమేశ్వరుడికి ప్రీతికరమైన ఆహుతులను పూజారులు అగ్నికి సమర్పిస్తారు. దీంతో అనారోగ్యం, నెగెటివ్ ఎనర్జీ దూరమై శివుడి అనుగ్రహంతో అర్థ, అంగ బలం పొందుతారు. అందుబాటు ఛార్జీల్లో పూజ, వివరాల కోసం <
News December 16, 2025
ADB: మూడో విడత ఎన్నికలకు పటిష్ట పోలీసు బందోబస్తు: ఎస్పీ

ఆదిలాబాద్ జిల్లాలో మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికల కోసం పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ఐదు మండలాల్లోని 151 జీపీలలో గల 204 పోలింగ్ కేంద్రాల వద్ద 938 మంది సిబ్బందిని మోహరించినట్లు చెప్పారు. ఇప్పటికే 756 మందిని బైండోవర్ చేశామని, అక్రమ మద్యం రవాణా జరగకుండా పర్యవేక్షించాలని సిబ్బందిని ఆదేశించారు.
News December 16, 2025
ముస్తాబాద్: 730 మందితో పటిష్ట బందోబస్తు: ఎస్పీ

మూడవ విడత గ్రామపంచాయతీ ఎన్నికలకు 730 మంది పోలీస్ సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని సిరిసిల్ల ఎస్పీ మహేష్ బి గితే అన్నారు. ముస్తాబాద్, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట పోలీస్ స్టేషన్లలో ఎన్నికల విధులపై పోలీసులకు దిశా నిర్దేశం చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఆఖరి విడత గ్రామపంచాయతీ ఎన్నికలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని, ప్రజలు ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు.


