News January 19, 2026

నేటి నుంచి మాఘ మాసం

image

మాఘమాసం ఆధ్యాత్మిక, ఆరోగ్యపరంగా ఎంతో విశిష్టమైనది. చంద్రుడు మఖ నక్షత్రంలో ఉండటం వల్ల దీనికి మాఘం అనే పేరు వచ్చింది. ఈ నెలలో సూర్యోదయానికి ముందే నదీస్నానం ఆచరించి, సూర్యుడిని, విష్ణుమూర్తిని ఆరాధిస్తే పాపాలు తొలగి, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని నమ్మకం. అక్షరాభ్యాసం, వివాహం వంటి శుభకార్యాలకు ఇదెంతో అనువైన సమయం. ఈ మాసమంతా విష్ణుసహస్రనామ పారాయణ, దానధర్మాలు చేయడం వల్ల పుణ్యఫలాలు లభిస్తాయని నమ్ముతారు.

Similar News

News April 13, 2026

హార్ముజ్‌లో హై టెన్షన్.. చిక్కుకున్న 15 భారత నౌకలు

image

హార్ముజ్ జలసంధి వద్ద ప్రస్తుతం 15 భారత నౌకలు చిక్కుకుపోయాయి. వీటిలో LPG, LNG, చమురు, కెమికల్ ట్యాంకర్లు ఉండటంతో దేశీయంగా ఆందోళన నెలకొంది. పరిస్థితిని గమనిస్తున్న ఇండియన్ నేవీ 6 యుద్ధనౌకలను రంగంలోకి దించి సమన్వయం చేస్తోంది. ఇరాన్‌తో శాంతి చర్చలు విఫలమవడంతో పర్షియన్ గల్ఫ్, ఒమన్ గల్ఫ్‌లోని ఇరాన్ పోర్టులను దిగ్బంధిస్తామని ట్రంప్ ప్రకటించడం హార్ముజ్‌లో మళ్లీ హై టెన్షన్‌కు కారణమైంది.

News April 13, 2026

విజయశాంతిరెడ్డి ఆత్మహత్య.. భర్త సంచలన ఆరోపణలు

image

TG: హైదరాబాద్‌లోని చర్లపల్లిలో రెండు నెలల కిందట పిల్లలతో కలిసి <<19059157>>ఆత్మహత్య<<>> చేసుకున్న విజయశాంతిరెడ్డి భర్త సురేందర్ సంచలన ఆరోపణలు చేశారు. తన భార్య కుటుంబీకుల వేధింపుల వల్లే వారు సూసైడ్ చేసుకున్నారని చెప్పారు. ‘నా అత్త పుష్పలత, బావమరిది చిరంజీవి నమ్మించి మోసం చేశారు. విజయ చనిపోయిన నాటి నుంచి ఆస్తుల కోసం నన్ను వేధించారు. వారి నుంచి నాకు ప్రాణహాని ఉంది. రక్షణ కల్పించాలి’ అని పోలీసులను కోరారు.

News April 13, 2026

మంచం మీద కూర్చొని ఎందుకు తినకూడదు?

image

ఇంట్లో ఆదాయం పెరగాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా జ్యోతిష నియమాలు పాటించాలని జ్యోతిష నిపుణులు చెబుతున్నారు. మంచం మీద కూర్చొని భోజనం చేయడం దరిద్రాన్ని ఆహ్వానించినట్టేనని అంటున్నారు. ‘ఇలా తినడం వల్ల అన్నపూర్ణ దేవికి కోపం వస్తుంది. ఫలితంగా డబ్బు రాక నిలిచిపోతుంది. ఇది ఇంట్లో ప్రతికూలతను పెంచుతుంది. వాస్తు దోషాలను సృష్టించి పురోగతికి ఆటంకం కలిగిస్తుంది. ఆర్థిక నష్టాలు కలగవచ్చు’ అని వివరిస్తున్నారు.