News December 20, 2025
నేటి నుంచి రాజధాని యువతకు CRDA-SRM ఉచిత నైపుణ్య శిక్షణ

AP CRDA SRM యూనివర్శిటీతో కలిసి రాజధాని ప్రాంత యువత కోసం ఉచిత నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలను ప్రారంభించింది. డిసెంబర్ 20 నుంచి అమరావతిలోని SRM క్యాంపస్‌లో ఈ శిక్షణలు నిర్వహించనున్నారు. కోర్సుల్లో ఉచిత శిక్షణతో పాటు భోజనం, రవాణా సౌకర్యం కల్పిస్తారు. ఆసక్తి గల అభ్యర్థులు https://tinyurl.com/srmapcrda లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని CRDA కమిషనర్ తెలిపారు.
Similar News
News December 31, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (డిసెంబర్ 31, బుధవారం)

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5:28 గంటలకు ♦︎ సూర్యోదయం: ఉదయం 6:46 గంటలకు ♦︎ దుహర్: మధ్యాహ్నం 12:19 గంటలకు ♦︎ అసర్: సాయంత్రం 4:16 గంటలకు ♦︎ మఘ్రిబ్: సాయంత్రం 5:52 గంటలకు ♦︎ ఇష: రాత్రి 7:10 గంటలకు ➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News December 31, 2025
31న రాత్రి 10 గంటల నుంచి స్పెషల్ డ్రైవ్: రామగుండం సీపీ

డిసెంబర్ 31న రాత్రి 10 గంటల నుంచి రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు సీపీ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. పట్టుబడిన వారిపై కేసులు నమోదు చేసి, బైండోవర్ చర్యలు తీసుకుంటామన్నారు. ప్రమాదాల నివారణ, అక్రమ సిట్టింగులు, బహిరంగంగా మద్యం తాగడం, మహిళలను వేధించడం వంటి సంఘటనలను అరికట్టేందుకు నిరంతర పర్యవేక్షణతో ముమ్మరంగా పెట్రోలింగ్ నిర్వహిస్తామని తెలిపారు.
News December 31, 2025
జగిత్యాల: జర్మనీలో నర్సులకు ఉద్యోగ అవకాశాలు

TOMCOM ఆధ్వర్యంలో అర్హత కలిగిన నర్సులకు జర్మనీలో ఉచిత జర్మన్ భాష శిక్షణ అందించి అక్కడి ఆసుపత్రుల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి సత్యమ్మ తెలిపారు. B.sc నర్సింగ్ లేదా GNM పూర్తిచేసి 1-3 ఏళ్ల క్లినికల్ అనుభవం కలిగి 22-38 ఏళ్ల వయసున్నవారు అర్హులన్నారు. వేతనం నెలకు రూ.2.5లక్షల- రూ.3లక్షల వరకు ఉంటుందన్నారు. వివరాలకు CONTACT 9440051581.


