News April 22, 2025

నేటి నుంచి విశాఖ రైల్వే స్టేడియంలో సమ్మర్ క్యాంప్

image

ఈస్ట్ కోస్ట్ రైల్వే స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విశాఖ రైల్వే స్టేడియంలో ఏప్రిల్ 22 నుంచి మే 31 వరకు సమ్మర్ క్యాంప్ నిర్వహించనున్నట్లు డీఆర్ఎం లలిత్ బోహ్రా సోమవారం తెలిపారు. 5 నుంచి 15 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు ప్రతిరోజూ ఉదయం 12రకాల క్రీడలలో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. సమ్మర్ కోచింగ్ క్యాంప్‌లో విశాఖలో నివసించే వారు అర్హులని అన్నారు. పూర్తి వివరాలకు రైల్వే స్టేడియంలో సంప్రదించాలన్నారు.

Similar News

News April 22, 2025

విశాఖలో నేటి కాయగూరల ధరలు

image

విశాఖలోని 13 రైతు బజార్‌లలో కొనుగోలు చేసే కూరగాయల ధరలను వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికారులు మంగళవారం ఈ విధంగా నిర్ణయించారు. ఉల్లి రూ.18, వంకాయలు రూ. 15, బంగాళాదుంపలు రూ.18,కాకరకాయ రూ.30,బీరకాయలు రూ.32, బెండకాయలు రూ.22,క్యాబేజీ రూ.15,గోరు చిక్కుడు రూ.32,పొటల్స్ రూ.30,కాప్సికం రూ.40,టమాటా రూ.16, క్యారట్ రూ.26/28,దొండకాయలు రూ.18, బీన్స్ రూ.48,కీర దోస రూ.20, చేమ దుంపలు రూ.32, మిర్చి రూ.24గా ఉన్నాయి.

News April 22, 2025

విశాఖ: మేడ మీద నుంచి పడి వివాహిత మృతి

image

మేడ మీద బట్టలు ఆరవేయడానికి వెళ్లి వివాహిత మృతి చెందిన ఘటన విశాఖలో సోమవారం చోటుచేసుకుంది. 61వ వార్డు ఇండస్ట్రీ కాలనీలో నివాసముంటున్న కోమలి తన ఇంటి మూడో అంతస్తులో బట్టలు ఆరవేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు కాలుజారి కిందపడిపోయింది. వెంటనే కుటుంబ సభ్యులు గమనించి కళ్యాణి ఆసుపత్రికి తరలించగా.. మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. భర్త శ్రీనుబాబు మల్కాపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News April 22, 2025

సింహాచలంలో ఏప్రిల్ 27న గంధం అమావాస్య వేడుకలు

image

సింహాచలం వరహాలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఏప్రిల్ 27న గంధం అమావాస్య వేడుకలు నిర్వహించనున్నట్లు ఈవో సుబ్బారావు సోమవారం తెలిపారు. ఈనెల 26 సాయంత్రం నుంచి భక్తులు కొండ కింద వరాహ పుష్కరిణి వద్ద జాగరము ఉండి స్నానమాచరించి స్వామి వారి దర్శనము చేసుకొని వెళ్లడం ఆనవాయితీగా వస్తుంది. ఏప్రిల్ 28 నుంచి మే2 వరకు ఆలయంలో తిరునక్షత్ర మహోత్సవము నిర్వహించనున్నారు. పైతేదీలలో అన్ని రకాల సేవలు రద్దు చేశారు.

error: Content is protected !!