News February 27, 2026
నేటి నుంచి వీరవల్లి శ్రీ తిరుపతమ్మ, గోపయ్య తిరుణాళ్లు

బాపులపాడు మండలం వీరవల్లిలోని శ్రీ తిరుపతమ్మ , గోపయ్యగార్ల తిరునాళ్లు శుక్రవారం మొదలు కానున్నాయి. 10 రోజుల పాటు జరిగే ఉత్సవాల కోసం నిర్వాహకులు విస్తృత ఏర్పాట్లు పూర్తి చేశారు. తొలిరోజు ఉదయం 10 గంటలకు అమ్మవారి కళ్యాణం చేయనున్నారు. సాయంత్రం మేళతాళాలు, కోలాటాలు, చెక్కభజనలతో గ్రామ ప్రభల మధ్య అమ్మవారి ఊరేగింపు కొనసాగుతుంది. చివరి రోజు భక్తులకు అన్నసంతర్పణ చేయనున్నారు.
Similar News
News February 27, 2026
మార్చి 28న ఐపీఎల్ ప్రారంభం?

ఈ ఏడాది ఐపీఎల్ మార్చి 28న ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. గత ఏడాది డిసెంబరులో BCCI ఐపీఎల్ 2026 ప్రారంభ తేదీని మార్చి 26గా ప్రకటించింది. అయితే అస్సాం, బెంగాల్, తమిళనాడు ఎన్నికల తేదీలపై ఇంకా క్లారిటీ రాకపోవడంతో ప్రారంభ తేదీని 28కు మార్చినట్లు క్రిక్ఇన్ఫో వెల్లడించింది. ఫైనల్ మే 31న జరగనుందని తెలిపింది. కాగా వచ్చే వారం ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.
News February 27, 2026
ధర్మపురి పేరుతో తండ్రిని విడిచిపెట్టిన కుమారుడు

ధర్మపురికి తీసుకెళ్తామని చెప్పి నిజామాబాద్‌కు చెందిన గలుముల రమేష్, జమున వృద్ధ తండ్రి నారాయణను జగిత్యాల పాత బస్టాండ్‌లో వదిలేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజెన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు హరి అశోక్ కుమార్ వృద్ధుడికి ఆశ్రయం కల్పించారు. అనంతరం బృందంతో కలిసి నిజామాబాద్‌లో వారి ఇంటికి వెళ్లి కౌన్సిలింగ్ ఇచ్చారు. క్షమాపణ చెప్పి వృద్ధుడిని ఇంటికి తీసుకెళ్లారు.
News February 27, 2026
జగిత్యాల: బస్టాండ్‌లో అనుమానాస్పద మహిళ గుర్తింపు

జగిత్యాల కొత్త బస్టాండ్‌లో అనుమానాస్పదంగా తిరుగుతున్న మహిళను స్థానికులు గుర్తించి విచారించారు. ఆమె గిరి మని లక్ష్మీనరసు (47)నిజామాబాద్ జిల్లా వాసిగా తెలిపింది. నాలుగు రోజుల క్రితం ఇంట్లో గొడవ జరిగి బయటకు వచ్చానని వెల్లడించింది. అనంతరం మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో విధుల్లో ఉన్న పోలీసు అధికారులకు ఆమెను అప్పగించారు. పోలీసులు వివరాలు నమోదు చేసి కుటుంబ సభ్యులతో సంప్రదింపులు చేపట్టారు.


