News April 6, 2024
నేటి నుంచి శ్రీశైల మల్లన్న స్పర్శ దర్శనం రద్దు
జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైల క్షేత్రంలో నేటి శనివారం నుంచి ఈనెల 10వ తేదీ వరకు ఉగాది మహోత్సవాలను నిర్వహిస్తున్నారు. అందరికీ స్వామివారి దర్శనం కల్పించాలని ఉద్దేశంతో మల్లన్న స్పర్శ దర్శనాన్ని నేటి నుంచి ఉగాది ఉత్సవాలు ముగిసే వరకు రద్దు చేస్తున్నట్లు ఈవో పెద్దిరాజు తెలిపారు. అందరికీ అలంకార దర్శనమేనని తెలిపారు. కాగా శుక్రవారం వరకు భక్తులందరికీ స్వామివారి స్పర్శ దర్శనాన్ని కల్పించారు.
Similar News
News February 5, 2025
కర్నూలు APSP బెటాలియన్ కమాండెంట్‌గా దీపిక బాధ్యతల స్వీకరణ
కర్నూలు ఏపీఎస్పీ 2వ బెటాలియన్ కమాండెంట్‌గా దీపిక పాటిల్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. పోలీసుల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తానని వెల్లడించారు. ముందుగా బెటాలియన్ అధికారుల నుంచి ఆమె గౌరవ వందనం స్వీకరించారు. అడిషనల్ కమాండెంట్ మెహబూబ్ బాషా, తదితరులు పాల్గొన్నారు.
News February 5, 2025
కుటుంబానికి 100 రోజులు పని కల్పించాలి: కలెక్టర్
ఉపాధి హామీ పథకం ద్వారా ప్రతి రోజూ లక్ష మందికి ఉపాధి పనులు కల్పించాలని ఏపీడీ, ఎంపీడీవో, ఏపీవోలను కలెక్టర్ రంజిత్ బాషా ఆదేశించారు.ఉపాధి హామీ పనుల పురోగతి అంశంపై ఏపీడీలు, ఎంపీడీవోలు, ఏపీవోలతో కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ ద్వారా బుధవారం సమీక్ష నిర్వహించారు. పనుల కల్పనలో వెనుకబడిన అధికారులతో మాట్లాడారు. కుటుంబానికి 100 రోజుల పని కల్పించాలన్నారు.
News February 5, 2025
పారా అథ్లెటిక్స్‌లో ఎమ్మిగనూరు డిగ్రీ విద్యార్థి ఘనత
గుంటూరు జిల్లా మంగళగిరిలో ఈనెల 2న జరిగిన 7వ రాష్ట్రస్థాయి పారా అథ్లెటిక్స్‌లో ఎమ్మిగనూరు శ్రీ మహాయోగి లక్ష్మమ్మ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థి పింజారి బషీర్ సత్తా చాటాడు. 100 మీటర్లు, 1,500 మీటర్ల పరుగు పందెంలో మొదటి స్థానం సాధించాడు. ఈ విజయంతో కళాశాలకు రాష్ట్రస్థాయిలో గుర్తింపు వచ్చిందని కళాశాల అధ్యక్షుడు డా.మహబూబ్ బాషా పేర్కొన్నారు. బషీర్‌ను కళాశాల అధ్యాపక సిబ్బంది అభినందించారు.