News December 28, 2024
నేటి నుంచి APGVB సేవలు బంద్
ఆంధ్రప్రదేశ్ గ్రామీ వికాస్ బ్యాంక్(APGVB) తెలంగాణ గ్రామీణ బ్యాంకు(TGB)లో విలీనం కానుంది. 2025 JAN1 నుంచి ప్రారంభం కానుంది. నేటి నుంచి 31 వరకు బ్యాంకింగ్ సేవల (UPI, ATM, మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, AEPS, CSP) తాత్కాలికంగా అంతరాయం ఉంటుందని, వినియోగదారులు సహకరించాలని పాలమూరు జిల్లా బ్యాంకు అధికారులు కోరారు. ఈ బ్యాంకుకు ఉమ్మడి పాలమూరులో 85 బ్రాంచ్‌లు ఉన్నాయి.
Similar News
News December 29, 2024
NRPT: ‘ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు పరిహారం ఇవ్వాలి’
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు నష్ట పరిహారం త్వరగా అందించేందుకు పోలీసులు, సెక్షన్ అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. శనివారం నారాయణపేట కలెక్టరేట్‌లో షెడ్యూల్డు కులాలు, తెగల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. 15 పెండింగ్ కేసుల్లో బాధితులకు నష్ట పరిహారం అందాల్సి ఉందని డిఎస్పీ లింగయ్య తెలిపారు.
News December 29, 2024
ఉమ్మడి జిల్లాలో నేటి..TOP NEWS.!
✔మన్మోహన్ సింగ్‌కు ఎమ్మెల్యేల నివాళులు✔రేపు సెమిస్..MBNR❌ సెమిస్..MBNR❌ ఇందిరమ్మ ఇండ్ల సర్వే✔నల్లమల సఫారీలో పెద్దపులి✔నేటి నుంచి APGVB సేవలు బంద్✔రేపు పలు గ్రామాల్లో కరెంట్ బంద్✔వేతనాలు చెల్లించాలని కార్మికుల ధర్నా✔కల్వకుర్తి:పచ్చ జొన్నల పేరుతో మోసం✔వనపర్తి: పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సీపీఎం డిమాండ్✔దొంగతనాలకు పాల్పడిన వ్యక్తి అరెస్టు:NRPT డీఎస్పీ
News December 28, 2024
MBNR: మన్మోహన్ సింగ్‌కు ఎమ్మెల్యేల నివాళులు
భారత మాజీప్రధాని మన్మోహన్ సింగ్‌కు శనివారం ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలు ఘన నివాళులర్పించారు. MBNRలోని మూఢ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మన్మోహన్ సింగ్ చిత్రపటానికి ఎమ్మెల్యేలు మధుసూదన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, అనిరుద్ రెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డిలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మూడ ఛైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మున్సిపల్ ఛైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు.