News July 7, 2025
నేటి ప్రజావాణికి 95దరఖాస్తులు: కలెక్టర్

ప్రజావాణిలో వచ్చిన ప్రతి దరఖాస్తు క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సోమవారం సూర్యాపేట కలెక్టరేట్‌లో ప్రజావాణికి వచ్చినా దరఖాస్తుల వివరాలు వెల్లడించారు. భూ సమస్యలు 47, ఎంపీడీఓకి 13, డీపీఓ 10, శాఖలకు సంబంధించి 25 మొత్తం 95 దరఖాస్తులు వచ్చాయన్నారు. వాటిని పరిష్కరించేందుకు సంబంధిత అధికారులకి పంపుతామన్నారు.
Similar News
News July 8, 2025
ఆర్టీసీ వరంగల్-2 డిపో డీఎంగా రవిచందర్

వరంగల్ రీజియన్‌లోని వరంగల్-2 డిపో మేనేజర్‌గా ఎం.రవిచందర్‌ను నియమిస్తూ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంతకాలం వరంగల్-2 డిపో మేనేజర్‌గా పనిచేసిన జ్యోత్స్న ఖమ్మం రీజియన్ ఏవోగా బదిలీ అయ్యారు. దీంతో పరకాల డిపో మేనేజర్‌గా పనిచేస్తున్న రవిచందర్‌ను వరంగల్-2 డిపోకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలుపడ్డాయి.
News July 8, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News July 8, 2025
లైంగిక ఆరోపణలు.. దయాల్‌పై FIR నమోదు

పేసర్ యష్ దయాల్‌పై ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఇందిరాపురం PSలో FIR నమోదైంది. అతనిపై ఘజియాబాద్ యువతి లైంగిక ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఆమె CM గ్రీవెన్స్ పోర్టల్‌లో అతనిపై ఫిర్యాదు చేసింది. దాంతో పోలీసులు భారతీయ న్యాయ సంహిత(BNS) సెక్షన్ 69 ప్రకారం దయాల్‌పై కేసు నమోదు చేశారు. పెళ్లి, ఉద్యోగం వంటి తప్పుడు వాగ్దానాలతో మోసం చేసిన ఘటనల్లో ఈ సెక్షన్ వాడతారు. నేరం రుజువైతే అతనికి పదేళ్ల వరకు శిక్ష పడుతుంది.