News January 13, 2026

నేటి ముఖ్యాంశాలు

image

❂ AP: పుష్కరాల్లోగా ‘పోలవరం’ జాతికి అంకితం: CBN
❂ యువత భవిష్యత్తును ప్రభుత్వం ప్రమాదంలో పడేసింది: జగన్
❂ చంద్రబాబు అప్పులు చేస్తే రాష్ట్రం సింగపూర్ అవుతుందా: రాంబాబు
❂ TG: తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే 10% జీతం కట్: రేవంత్
❂ ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ ప్రకటించిన ప్రభుత్వం
❂ జిల్లాలను రద్దు చేస్తే ఉద్యమమే: కేటీఆర్
❂ మున్సిపాలిటీల్లో మొత్తం 51.92 లక్షల మంది ఓటర్లు

Similar News

News March 29, 2026

ఇరాన్‌లో గ్రౌండ్ ఆపరేషన్‌కు US సిద్ధం!

image

పశ్చిమాసియాలో యుద్ధం మరో స్థాయికి చేరనుంది. ఇరాన్‌లో గ్రౌండ్ ఆపరేషన్‌కు వేలాది <<19503626>>US సైనికులు<<>> అక్కడికి చేరుకుంటున్నారు. ఖర్గ్ ద్వీపం, హార్ముజ్ జలసంధి సమీపంలోని స్థావరాలపై కొన్ని వారాలపాటు దాడులు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు వాషింగ్టన్ పోస్ట్ వెల్లడించింది. అయితే దీనికి ట్రంప్ అనుమతిచ్చారా లేదా అనేది క్లారిటీ లేదంది. ఆ ఆపరేషన్ పూర్తిస్థాయి దండయాత్రలా కాకుండా వ్యూహాత్మకంగా ఉంటుందని పేర్కొంది.

News March 29, 2026

MEGA158.. ఊర మాస్ లుక్‌లో చిరు?

image

‘వాల్తేరు వీరయ్య’ తర్వాత బాబీ-చిరంజీవి కాంబినేషన్‌లో తెరకెక్కే సినిమా(MEGA158) షూటింగ్ APR 20న ప్రారంభం కానున్నట్లు సమాచారం. యాక్షన్ ఎంటర్‌టైన్‌మెంట్‌గా మూవీ ఉంటుందని, ఊర మాస్ లుక్‌లో మెగాస్టార్ కనిపిస్తారని టాలీవుడ్ టాక్. భారీ బడ్జెట్‌తో రూపొందే ఈ చిత్రంలో హీరోయిన్‌గా ప్రియమణి, చిరు కూతురుగా అనశ్వరా రాజన్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఈ మూవీని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేసే అవకాశం ఉంది.

News March 29, 2026

అత్యాచార బాధితుల పేర్లను తీర్పుల్లోనూ వాడరాదు: సుప్రీంకోర్టు

image

అత్యాచార బాధితులు, వారి కుటుంబీకుల పేర్లను తీర్పుల్లోనూ ప్రస్తావించరాదని అన్ని హైకోర్టులకు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వారిని గుర్తించే అవకాశమున్న ఏ వివరాలనూ ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాలో చెప్పరాదని 2018లోనే అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చిందంది. లైంగిక నేరాల బాధితులకు సమాజంలో ఇబ్బందులు కలగకుండా ఇలా చేసినట్లు పేర్కొంది. ఓ బాలిక వివరాలను HP హైకోర్టు ప్రస్తావించడాన్ని తప్పుపట్టింది.