News January 17, 2026
నేటి ముఖ్యాంశాలు

✴ 70వేల ఉద్యోగాలు భర్తీ చేశాం: సీఎం రేవంత్
✴ ఉమ్మడి ఆదిలాబాద్‌లో సదర్మట్, చనాక-కొరాటా బ్యారేజీలను ప్రారంభించిన సీఎం
✴ మేడారంలో ఒక్కరోజే 6 లక్షల మంది భక్తుల దర్శనం
✴ మోడల్ స్కూళ్ల ప్రవేశ పరీక్ష షెడ్యూల్ విడుదల
✴ ఏపీకి 10 బిలియన్ డాలర్ల పెట్టుబడి: లోకేశ్
✴ రాజకీయ కక్షలతో ఇంకెంతమందిని బలితీసుకుంటారు?: జగన్
✴ ‘సంక్రాంతి’ తిరుగు ప్రయాణాలు.. బస్సులు, రైళ్లలో రద్దీ
Similar News
News March 29, 2026
ఇన్‌స్టాగ్రామ్‌లో అమ్మాయిల ప్రైవేట్ ఫొటోలు!

ఇన్‌స్టాగ్రామ్‌లో అడల్ట్ కంటెంట్ ఎక్కువైందని పలువురు ఆరోపిస్తున్నారు. కొందరు యువతులు ఇన్‌స్టాలోని సబ్‌స్క్రిప్షన్ ఫీచర్ (నెలకు రూ.89-890) ద్వారా యూజర్లకు ప్రైవేట్ ఫొటోలు షేర్ చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నారని పేర్కొంటున్నారు. మెటా యాజమాన్యం న్యూడ్ ఫొటోలను నియంత్రిస్తున్నప్పటికీ కొన్నింటిని అడ్డుకోలేకపోతోందని SMలో పోస్టులు చేస్తున్నారు. దీన్ని నియంత్రించాల్సిన అవసరం ఉందంటున్నారు. దీనిపై మీ COMMENT?
News March 29, 2026
అత్తామామల బాధ్యత కోడలిపై ఉండదు: అలహాబాద్ హైకోర్టు

BNSS సెక్షన్ 144 లేదా CrPC సెక్షన్ 125 ప్రకారం కోడలు తన అత్తామామలను పోషించడానికి బాధ్యత వహించరని అలహాబాద్ హైకోర్టు వెల్లడించింది. ‘సెక్షన్ 144 ప్రకారం మెయింటెనెన్స్ కోరే హక్కు కొందరికి ఉంది. అత్తామామలు ఆ పరిధిలోకి రారు. వారిని సంరక్షించాలనే నైతికత ఉన్నప్పటికీ చట్టపరమైన బాధ్యతగా అమలు చేయలేం’ అని పేర్కొంది. కొడుకు చనిపోయినందున కోడలు తమ బాగోగులు చూడాలంటూ వృద్ధులు దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేసింది.
News March 29, 2026
ఈ జిల్లాల ప్రజలు జాగ్రత్త!

TG: పలు జిల్లాల్లో ఇవాళ ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయని వాతావరణ నిపుణులు తెలిపారు. భద్రాద్రి, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, ములుగు, ADB, నిర్మల్, NZB, జగిత్యాల, మంచిర్యాల, KNR, సిరిసిల్ల, పెద్దపల్లి, BHPL జిల్లాల్లో 40-42డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుందని పేర్కొన్నారు. HYDలో 39-40°C నమోదవుతుందన్నారు. రేపు, ఎల్లుండి పలు చోట్ల మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని అంచనా వేశారు.


