News January 19, 2026
నేటి ముఖ్యాంశాలు

❆ BRS, KCRను బొంద పెడితేనే NTRకు నివాళి: రేవంత్
❆ ఫిబ్రవరి 15కు ముందే మున్సిపల్ ఎన్నికలు: పొంగులేటి
❆ రేవంత్ డీఎన్‌ఏలోనే ద్రోహ బుద్ధి ఉంది: హరీశ్‌రావు
❆ వచ్చే ఏడాది జులై 27- ఆగస్టు 3 వరకు గోదావరి పుష్కరాలు
❆ AP: బాబాయ్‌ని చంపినంత ఈజీ కాదు రాజకీయాలు: CM CBN
❆ రాష్ట్ర పరిణామాలపై ప్రధాని జోక్యం చేసుకోవాలి: బొత్స
❆ న్యూజిలాండ్ చేతిలో వన్డే సిరీస్ కోల్పోయిన టీమ్ ఇండియా
Similar News
News March 29, 2026
అత్తామామల బాధ్యత కోడలిపై ఉండదు: అలహాబాద్ హైకోర్టు

BNSS సెక్షన్ 144 లేదా CrPC సెక్షన్ 125 ప్రకారం కోడలు తన అత్తామామలను పోషించడానికి బాధ్యత వహించరని అలహాబాద్ హైకోర్టు వెల్లడించింది. ‘సెక్షన్ 144 ప్రకారం మెయింటెనెన్స్ కోరే హక్కు కొందరికి ఉంది. అత్తామామలు ఆ పరిధిలోకి రారు. వారిని సంరక్షించాలనే నైతికత ఉన్నప్పటికీ చట్టపరమైన బాధ్యతగా అమలు చేయలేం’ అని పేర్కొంది. కొడుకు చనిపోయినందున కోడలు తమ బాగోగులు చూడాలంటూ వృద్ధులు దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేసింది.
News March 29, 2026
ఈ జిల్లాల ప్రజలు జాగ్రత్త!

TG: పలు జిల్లాల్లో ఇవాళ ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయని వాతావరణ నిపుణులు తెలిపారు. భద్రాద్రి, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, ములుగు, ADB, నిర్మల్, NZB, జగిత్యాల, మంచిర్యాల, KNR, సిరిసిల్ల, పెద్దపల్లి, BHPL జిల్లాల్లో 40-42డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుందని పేర్కొన్నారు. HYDలో 39-40°C నమోదవుతుందన్నారు. రేపు, ఎల్లుండి పలు చోట్ల మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని అంచనా వేశారు.
News March 29, 2026
SRH ఆల్‌రౌండర్ బ్రైడన్ కార్స్‌కు గాయం

SRH బౌలింగ్ ఆల్‌రౌండర్ బ్రైడన్ కార్స్(ఇంగ్లండ్) గాయపడినట్లు హెడ్ కోచ్ వెటోరీ వెల్లడించారు. బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా బంతి ఆయన చేతికి బలంగా తాకడంతో వాపు వచ్చిందన్నారు. RCBతో మ్యాచులో ఆడటానికి ట్రై చేసినప్పటికీ సాధ్యం కాలేదని చెప్పారు. ప్రస్తుతం బ్రైడన్ కోలుకుంటున్నారని తెలిపారు. ఏప్రిల్ 2న KKRతో మ్యాచుకు అందుబాటులో ఉంటారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.


