News January 26, 2026
నేటి ముఖ్యాంశాలు

* 131 మందికి పద్మ పురస్కారాలు ప్రకటించిన కేంద్రం
* అంతరిక్ష యాత్ర పూర్తిచేసిన శుభాంశు శుక్లాకు అశోక చక్ర
* అమరావతికి చట్టబద్ధతే లక్ష్యం.. ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం
* TG: సింగరేణి టెండర్ల రద్దుపై విచారణకు సిద్ధం: కోమటిరెడ్డి
* నాంపల్లి అగ్నిప్రమాదంలో ఐదుగురు మృతి.. రూ.5 లక్షల చొప్పున పరిహారం
* సింగరేణిలో మిగిలిన స్కామ్‌లను బయటపెడతాం: హరీశ్ రావు
* న్యూజిలాండ్‌పై మూడో T20Iలో భారత్ విజయం
Similar News
News January 26, 2026
జగిత్యాల: ప్రశంసా పత్రం అందుకున్న డిప్యూటీ డీఎంహెచ్ఓ

జగిత్యాలలో సోమవారం జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలలో డిప్యూటీ డీఎంహెచ్ఓ ఎన్. శ్రీనివాస్ సోమవారం కలెక్టర్ సత్యప్రసాద్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. విధులలో మెరుగైన సేవలు అందించినందుకు గాను కలెక్టర్ ఆయనకు ప్రశంసా పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయనను పలువురు వైద్య అధికారులు తదితరులు అభినందించారు.
News January 26, 2026
ముగిసిన రిపబ్లిక్ డే వేడుకలు

ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో 77వ రిపబ్లిక్ డే వేడుకలు ముగిశాయి. ఈ సందర్భంగా ‘వందేమాతరం’, ‘భారత్ మాతాకీ జై’ నినాదాలతో పరిసరాలు హోరెత్తాయి. అంతకుముందు కీరవాణి కంపోజ్ చేసిన పాటను శ్రేయా ఘోషల్ ఆలపించారు. త్రివిధ దళాలు చేసిన విన్యాసాలు వీక్షకులను ఆకట్టుకున్నాయి. సైన్యం నుంచి గౌరవ వందనం స్వీకరించిన రాష్ట్రపతి వారికి వీడ్కోలు పలికి అతిథులతో గుర్రపు బగ్గీలో అక్కడి నుంచి రాష్ట్రపతి భవన్‌కు వెళ్లారు.
News January 26, 2026
మావోల గడ్డపై తొలిసారి గణతంత్ర వేడుకలు

ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతం చరిత్రలో నేడు ఒక మరిచిపోలేని ఘట్టం నమోదైంది. దశాబ్దాల పాటు మావోయిస్టుల ప్రభావంతో జాతీయ పండుగలకు దూరమైన 47 మారుమూల గ్రామాలు తొలిసారి గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నాయి. బీజాపూర్, నారాయణ్‌పూర్, సుక్మా జిల్లాల్లో మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ప్రశాంత వాతావరణం నెలకొంది. రోడ్లు, బ్యాంకులు, పాఠశాలలు అందుబాటులోకి వస్తున్నాయి.


