News December 19, 2025

నేటి ముఖ్యాంశాలు

image

❁ AP: చంద్రబాబుకు ‘బిజినెస్ రీఫార్మర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు
❁ ‘PPP’ తప్పనుకుంటే నన్ను జైలుకు పంపు జగన్: సత్యకుమార్
❁ వైద్యం కోసం పేదలు ఆస్తులు అమ్ముకోవాలి: జగన్
❁ గతేడాదితో పోలిస్తే ఏపీలో నేరాలు తగ్గుముఖం: DGP
❁ TG: గ్రామపంచాయతీ ఎన్నికల్లో 66% సీట్లు మావే: రేవంత్
❁ గ్రూప్-3 ఫలితాలు విడుదల.. 1,370 మంది అభ్యర్థులు ఎంపిక
❁ KCR అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారు: KTR
❁ SMAT విజేతగా ఝార్ఖండ్

Similar News

News December 19, 2025

CNAP సర్వీస్ లాంచ్ చేసిన జియో

image

CNAP (కాలర్ నేమ్ ప్రజెంటేషన్) సర్వీస్‌ను జియో స్టార్ట్ చేసింది. కొత్త నంబర్ నుంచి కాల్ వచ్చినా మొబైల్ స్క్రీన్‌పై సిమ్ కార్డుతో రిజిస్టర్ అయిన వ్యక్తి పేరు కనిపిస్తుంది. సిమ్ కొనుగోలు చేసే సమయంలో ఇచ్చిన కేవైసీ డాక్యుమెంట్‌లో ఉన్న పేరు కనిపించేలా రూపొందించింది. స్పామ్, మోసపూరిత, డిజిటల్ స్కామ్‌లను నియంత్రణకు ఉపయోగపడే ఈ సర్వీస్ ట్రూకాలర్ వంటి థర్డ్ పార్టీ యాప్స్‌కు ప్రత్యామ్నాయంగా పనిచేస్తుంది.

News December 19, 2025

గ్రీన్ కార్డ్ లాటరీని నిలిపేసిన ట్రంప్

image

గ్రీన్ కార్డ్ లాటరీ ప్రోగ్రామ్‌ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సస్పెండ్ చేశారు. ఈ విషయాన్ని హోంల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ క్రిస్టీ నోయెమ్ వెల్లడించారు. ‘బ్రౌన్ యూనివర్సిటీలో కాల్పులు జరిపిన క్లాడియో మాన్యుయెల్ 2017లో డైవర్సిటీ లాటరీ ఇమిగ్రెంట్ వీసా ప్రోగ్రామ్ ద్వారా USలోకి వచ్చాడు. తర్వాత గ్రీన్ కార్డు పొందాడు. ఇలాంటి దారుణమైన వ్యక్తులను దేశంలోకి అనుమతించకూడదు’ అని పేర్కొన్నారు.

News December 19, 2025

గ్రీన్‌కార్డ్ లాటరీ సస్పెండ్.. ఇండియన్స్‌పై ప్రభావమెంత?

image

USలో గ్రీన్‌కార్డ్ లాటరీని <<18612958>>సస్పెండ్<<>> చేసిన నేపథ్యంలో భారతీయులపై దీని ప్రభావం ఎలా ఉంటుందనే చర్చ జరుగుతోంది. సాధారణంగా డైవర్సిటీ వీసాతో అమెరికాలోకి ప్రవేశించిన వారిలో ఏటా 50,000 మందికి లాటరీ ద్వారా గ్రీన్‌కార్డ్ జారీ చేస్తారు. కొన్నేళ్లుగా ఈ వీసా భారతీయులకు ఇవ్వడం లేదు. కాబట్టి మనవాళ్లపై ఇప్పటికైతే ప్రభావం ఉండదు. కానీ US ఇమిగ్రేషన్ పాలసీ మరింత కఠినంగా మారుతున్న విషయం మాత్రం స్పష్టమవుతోంది.