News January 29, 2026
నేడు అజిత్ పవార్ అంత్యక్రియలు

ఘోర విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ అంత్యక్రియలు ఇవాళ ఉ.11 గంటలకు జరగనున్నాయి. ఆయన సొంత నియోజకవర్గం బారామతిలోని విద్యా ప్రతిష్ఠాన్ మైదానంలో ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నారు. పవార్ అంత్యక్రియలకు PM మోదీ, కేంద్రమంత్రి అమిత్ షా, MH సీఎం ఫడణవీస్, AP మంత్రి లోకేశ్ హాజరవనున్నారు. నిన్న జరిగిన విమాన ప్రమాదంలో అజిత్ సహా ఐదుగురు మరణించారు.
Similar News
News February 7, 2026
డ్రాగన్ ఫ్రూట్ సాగుకు ‘ఉపాధి హామీ’.. తగ్గిన పెట్టుబడి, పెరిగిన ఆదాయం

సేంద్రియ పద్ధతిలో డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తూ మంచి ఆదాయం పొందుతున్నారు APలోని అనకాపల్లి జిల్లాలో పలువురు రైతులు. ఈ పంటకు ఉపాధి హామీ పథకం కింద నిధుల సాయంతో వీరి పెట్టుబడి ఖర్చు చాలా వరకు తగ్గుతోంది. నిపుణుల సూచనతో పంట నాటి తొలి ఏడాది నుంచే రూ.లక్షల్లో ఆదాయం పొందుతున్నారు. ఉపాధి హామీ కింద ఈ పంటకు ఎంత సాయం వస్తుంది? ఇతర కీలక సమాచారానికి <<-se_10015>>పాడిపంట క్లిక్<<>> చేయండి.
News February 7, 2026
IMPS ట్రాన్సాక్షన్లపై SBI ఛార్జీలు

IMPS ట్రాన్సాక్షన్లపై సర్వీస్ ఛార్జీల వసూలుకు SBI సిద్ధమైంది. రూ.25వేల-రూ.లక్ష వరకు రూ.2+GST, రూ.లక్ష-2లక్షల వరకు రూ.6+GST, రూ.2లక్షల-5లక్షల వరకు రూ.6+GST వసూలు చేయనుంది. అయితే రూ.25వేల కంటే తక్కువ నగదు బదిలీకి ఎటువంటి ఛార్జీ చెల్లించనవసరం లేదు. ఇంటర్నెట్, మొబైల్ బ్యాంకింగ్, యోనో యాప్ ద్వారా చేసే ట్రాన్సాక్షన్లపై ఛార్జీలు వర్తిస్తాయి. FEB 15 నుంచి ఈ ఛార్జీలు అమలులోకి రానున్నాయి.
News February 7, 2026
అసలైన హారతి కర్పూరాన్ని గుర్తించడం ఎలా?

అసలైన కర్పూరం వెలిగించినప్పుడు పూర్తిగా కరిగిపోతుంది. ఎలాంటి బూడిదను, నల్లటి మచ్చలను మిగల్చదు. ఇది స్పటికంలా ఉండి, సులభంగా విరిగిపోతుంది. నిజమైన కర్పూరాన్ని నీటిలో వేస్తే వెంటనే మునిగిపోతుంది. అదే నకిలీది అయితే నీటిపై తేలుతుంది. స్వచ్ఛమైన కర్పూరం ఘాటుగా ఉండకుండా ప్రశాంతమైన వాసననిస్తుంది. గాలిలో ఉంచితే కొద్దిసేపటికే ఆవిరైపోతుంది. రసాయనాలతో కూడిన నకిలీ కర్పూరం ఆరోగ్యానికి హానికరం.


