News September 10, 2025

నేడు అద్దంకికి రానున్న APS-RTC MD

image

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వైస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ద్వారకాతిరుమలరావు బుధవారం అద్దంకి ఆర్టీసీ డిపోను సందర్శించనున్నారు. ఈ విషయాన్ని అద్దంకి RTC డిపో మేనేజర్ బెల్లం రామ మోహన్‌రావు మంగళవారం తెలిపారు. RTC గ్యారేజీ, డిపో, బస్టాండ్ పరిసరాలను పరిశీలిస్తారన్నారు. ఆర్టీసీ అధికారులు అందుబాటులో ఉండాలని DM కోరారు.

Similar News

News September 10, 2025

ఇద్దరు ISIS అనుమానిత ఉగ్రవాదుల అరెస్ట్

image

ఇద్దరు ISIS అనుమానిత ఉగ్రవాదులను ఢిల్లీ స్పెషల్ సెల్ అరెస్ట్ చేసింది. ఝార్ఖండ్‌ రాజధాని రాంచీలోని ఇస్లాంనగర్‌లో అజార్ డానిష్, ఢిల్లీలో అఫ్తాబ్‌ను అదుపులోకి తీసుకుంది. వారి నుంచి ఆయుధాలు, బుల్లెట్లు, ఎలక్ట్రానిక్ డివైజెస్ స్వాధీనం చేసుకుంది. వీరిద్దరూ ఉగ్రకార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు గుర్తించింది. సెంట్రల్ ఏజెన్సీస్, ఝార్ఖండ్‌ ఏటీఎస్‌తో కలిసి రైడ్స్ చేసి వారిని పట్టుకుంది.

News September 10, 2025

జాడలేని పులస.. విలసలకు డిమాండ్

image

కోనసీమ పేరు చెప్పగానే ఠక్కున గుర్తుకు వచ్చేవి పులస చేపలు. వరదల సమయంలో సముద్రం నుంచి సంతానోత్పత్తికి గోదావరి నదిలోకి వచ్చే పులస జాడ లేక పోవడంతో మాంస ప్రియులు ఈ ఏడాది తీవ్ర నిరాశ చెందారు. దీంతో పులసను పోలి ఉండే విలసలకు డిమాండ్ ఏర్పడింది. దీంతో సముద్రంలో దొరికే విలసలను ఎక్కువ రేటుకు విక్రయిస్తున్నారు. ప్రస్తుతం వీటి ధర కేజీ రూ.700 నుంచి రూ.1500 పలుకుతోంది. పులస లేని లోటును విలసలతో తీర్చుకుంటున్నారు.

News September 10, 2025

వీటిని రోజూ వాడుతున్నారా?

image

అమ్మాయిలు ఎన్నో బ్యూటీప్రోడక్ట్స్ వాడతారు. వాటిలో కొన్నిటిని రోజూ వాడితే ఇబ్బందులొస్తాయంటున్నారు నిపుణులు. వాటర్‌ప్రూఫ్ మస్కారా రోజూ వాడితే కనురెప్పలు పొడిబారిపోతాయి. చర్మాన్ని వారానికి రెండుసార్లే స్క్రబ్ చెయ్యాలి. లేదంటే పొడిబారి నిర్జీవంగా మారుతుంది. డీప్ కండీషనర్స్‌ రోజూ వాడితే కేశాల్లోని పీహెచ్ స్థాయులపై ప్రభావం చూపి నిర్జీవంగా మారుస్తుంది. కాబట్టి వీటిని పరిమితంగా వాడాలని సూచిస్తున్నారు.