News September 11, 2025
నేడు అనకాపల్లిలో మెగా జాబ్ మేళా

అనకాపల్లి రాజా థియేటర్ వద్ద గల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గురువారం మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా అధికారి ఎన్.గోవిందరావు బుధవారం తెలిపారు. జాబ్ మేళాలో 20 కంపెనీలు పాల్గొంటున్నాయన్నారు. టెన్త్, ఐటీఐ, డిప్లమా, డిగ్రీ, పీజీ చేసి 18 నుంచి 35 ఏళ్ల వయసుగల యువతీ యువకులు అర్హులుగా పేర్కొన్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఇంటర్వ్యూలు జరుగుతాయని అన్నారు.
Similar News
News September 11, 2025
నల్గొండలో వంద శాతం పీపీఆర్ వ్యాక్సినేషన్

నల్గొండ జిల్లా పశుసంవర్థక శాఖ చేపట్టిన పీపీఆర్ వ్యాక్సినేషన్ కార్యక్రమం వంద శాతం పూర్తయింది. గత నెల 26 నుంచి జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో 12.50 లక్షల గొర్రెలు, మేకలకు ఈ టీకాలు వేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన సిబ్బందిని పశుసంవర్థక శాఖ అధికారి డాక్టర్ జి.వి.రమేష్ అభినందించారు.
News September 11, 2025
జగిత్యాల జిల్లాలో 20 జడ్పీటీసీ, 216 ఎంపీటీసీ స్థానాలు

జగిత్యాల జిల్లాలో కొత్తగా ఏర్పడిన భీమారం, ఎండపల్లి మండలాలతో కలిపి మొత్తం 20 మండలాలకు ఎంపీపీ, జడ్పీటీసీ స్థానాలు ఖరారయ్యాయి. గతంలో 18 ఎంపీపీ, 18 జడ్పీటీసీ స్థానాలుండగా, ప్రస్తుతం వాటి సంఖ్య 20కి చేరింది. పునర్వ్యవస్థీకరణ అనంతరం 214కు బదులుగా 216 ఎంపీటీసీ స్థానాలు ఏర్పాటయ్యాయి. మండలంలో కనీసం ఐదుకు తగ్గకుండా ఎంపీటీసీ స్థానాలు ఉండేలా అధికారులు ఏర్పాట్లు చేశారు.
News September 11, 2025
KMR: ఊట బావులు.. ఊసే లేదు

గ్రామీణ ప్రాంతాల్లో ఊట బావులు కనుమరుగైపోతున్నాయి. పూర్వం ఊట బావుల ద్వారా ప్రజలు నీటి అవసరాలు తీర్చుకునే వారు. ఆధునిక పరిజ్ఞానం పెగడంతో చాలా మంది ఊట బావులపై అశ్రద్ధ చూపడం వల్ల వాటిని పట్టించుకోవడం లేదు. పొలాలు, ఇళ్ల వద్ద ఊట బావులను నిర్మించుకుంటే బావుల్లో నీరు చేరి భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రభుత్వం జాతీయ ఉపాధి హామీలో ఊట బావులు తవ్విస్తున్నారు.