News March 22, 2025
నేడు అన్నమయ్య జిల్లాలో వర్షం

అన్నమయ్య జిల్లాలో ఒకవైపు ఎండలు మండిపోతున్నాయి. పలు చోట్ల ఇప్పటికే 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో జిల్లా ఉక్కపోతతో అల్లాడుతోంది. ప్రజలకు ఉపశమనం కలిగేలా నేడు అన్నమయ్య జిల్లాలో వర్షం పడే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. ఉపరితల ద్రోణి, బంగాళాఖాతంలో అధికపీడనం ప్రభావంతో నేడు వడగాల్పులు వీచే అవకాశం ఉంది. అలాగే ఆది, సోమవారాల్లో కూడా రాయలసీమలో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Similar News
News December 23, 2025
నేటి నుంచి జగన్ పులివెందుల పర్యటన

AP: వైసీపీ అధినేత జగన్ నేటి నుంచి 3 రోజుల పాటు పులివెందులలో పర్యటించనున్నారు. ఇవాళ 4pmకు పులివెందుల చేరుకొని భాకరాపురం క్యాంప్ ఆఫీసులో ప్రజాదర్బార్ నిర్వహిస్తారు. 24న ఉదయం ఇడుపులపాయకు వెళ్లి క్రిస్మస్ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. 1pmకు మళ్లీ పులివెందులలో ప్రజాదర్బార్ నిర్వహిస్తారు. 25న 8.30amకు CSI చర్చిలో జరిగే క్రిస్మస్ వేడుకలకు హాజరవుతారు. 10.30amకు పులివెందుల నుంచి తిరుగుపయనమవుతారు.
News December 23, 2025
ఢిల్లీ క్యాపిటల్స్‌కు కొత్త కెప్టెన్లు?

IPLతో పాటు WPLలో ఢిల్లీ జట్లకు కెప్టెన్లు మారనున్నట్లు క్రీడా వర్గాలు చెబుతున్నాయి. IPLలో గత సీజన్‌లో DCకి అక్షర్ సారథ్యం వహించగా ఆ జట్టు ప్లే ఆఫ్స్‌కు చేరుకోలేదు. దీంతో కెప్టెన్సీ తీసుకోవాలని రాహుల్‌ను ఫ్రాంచైజీ ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. గత సీజన్‌లోనే సారథిగా చేయాలని భావించినా ఆయన ఆసక్తి చూపలేదు. అటు WPLలో మెగ్ లానింగ్‌ను కెప్టెన్‌గా తప్పించి జెమీమాకు బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది.
News December 23, 2025
ధనుర్మాసం: ఎనిమిదో రోజు కీర్తన

‘తూర్పున తెలవారింది. గేదెలు మేతకు వెళ్లాయి. కృష్ణుడిని చేరుకోవాలని గోపికలంతా ఓచోట చేరి, నిద్రపోతున్న నిన్ను మేల్కొల్పుతున్నారు. కేశి అనే అసురుణ్ణి, చాణూర ముష్టికులను అంతం చేసిన వీరుడి సన్నిధికి అందరం కలిసి వెళ్దాం పద! మనకంటే ముందే ఆయన వస్తే బాగుండదు. మనమే ముందెళ్లి ఎదురుచూస్తే ఆయన సంతోషంతో మన కోరికలను వెంటనే నెరవేరుస్తారు. ఆలస్యం చేయక లే, కృష్ణ పరమాత్మను కొలిచి నోము ఫలాన్ని పొందుదాం’.<<-se>>#DHANURMASAM<<>>


