News May 19, 2024

నేడు అన్నవరం సత్యదేవుని కళ్యాణవేడుక

image

సత్య దేవుడు, అనంతలక్ష్మి అమ్మవార్ల దివ్య కళ్యాణం ఆదివారం రాత్రి 9:30 గంటలకు ప్రారంభం కానుంది. వీఐపీలు, భక్తులకు ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశారు. కళ్యాణం అనంతరం ముత్యాల తలంబ్రాలు, ప్రసాదం పంపిణీకి ప్రత్యేక కౌంటర్లు సిద్ధం చేశారు. శ్రీకాళహస్తి దేవస్థానం అర్చకుల ఆధ్వర్యంలో అలంకరణ చేయనున్నారు. కొండ దిగువ నుంచి కొండపైకి సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 1 గంట మధ్య ఉచిత రవాణా సదుపాయం ఏర్పాటు చేశారు.

Similar News

News April 22, 2025

తాళ్లపూడి: పుష్కరాల రేవులో శిశువు మృతదేహం లభ్యం

image

తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి పుష్కరాల స్నాన ఘట్టానికి వెళ్లే మార్గంలో ఆడ శిశువు మృతదేహాన్ని మంగళవారం స్థానికులు కనుగొన్నారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కొవ్వూరు సీఐ విజయబాబు ప్రాంతాన్ని సందర్శించి శిశువు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆడ శిశువు మృతదేహం లభ్యమవ్వడంతో చుట్టుపక్కల ప్రైవేట్ ప్రభుత్వ ఆసుపత్రులలో పోలీసులు విచారణ చేపట్టారు.

News April 22, 2025

కొవ్వూరు: ఒకే రోజు ఇద్దరు ఆత్మహత్య

image

కొవ్వూరు మండలంలో ఒకే రోజు ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. పట్టణానికి చెందిన వాలిశెట్టి రాంబాబు(54) ఉరివేసుకున్నారు. దొమ్మేరుకి చెందిన వరలక్ష్మి ఈనెల 20న 40మాత్రలు మింగిడంతో అపస్మారక స్థితికి చేరుకున్నారు. ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదులతో రెండు ఘటనలపై పట్టణ పోలీసులు విడివిడిగా కేసులు నమోదు చేశారు.

News April 22, 2025

రాజమండ్రి: సప్లమెంటరీ పరీక్షల ఫీజు గడువు ముగింపు

image

ఇంటర్ అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షలకు ఫీజు చెల్లింపునకు మంగళవారంతో గడువు ముగియనుందని ఆర్ఐవో నరసింహం తెలిపారు. పరీక్ష ఫీజు చెల్లింపునకు ఇకపై గడువు పొడిగించబడదన్నారు. అలాగే రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కు ఫీజు చెల్లింపునకు నేటితో గడువు ముగియనుందని ఆయన పేర్కొన్నారు. ఇంకా ఫీజు చెల్లించని విద్యార్థులు సాయంత్రం 4గంటలలోగా ఆన్‌లై‌న్ ద్వారా చెల్లించవచ్చని తెలిపారు.

error: Content is protected !!