News February 5, 2026

నేడు అమరావతికి రానున్న చంద్రబాబు.. షెడ్యూల్ ఇదే!

image

అమరావతి ప్రాంతంలో CM చంద్రబాబు నాయుడు గురువారం పర్యటించనున్నారు. మధ్యాహ్నం 2.30 గంటలకు వెలగపూడి సచివాలయానికి, అనంతరం 2.50 గంటలకు రాయపూడి పెరేడ్ గ్రౌండ్‌కు చేరుకొని సాగునీటి సంఘాల సమావేశంలో పాల్గొంటారు. సాయంత్రం 5.50 గంటలకు నివాసానికి చేరుకొని, 6.10 గంటలకు కార్మిక శాఖపై సమీక్ష నిర్వహిస్తారు. ఈ మేరకు అధికారులు పర్యటన వివరాలను విడుదల చేశారు.

Similar News

News February 20, 2026

నాడు నాగన-కందనవోలు.. నేడు నాగర్‌కర్నూల్

image

నాగర్‌కర్నూల్ పేరు వెనుక ఒక విశిష్టమైన చరిత్ర దాగి ఉంది. పూర్వ కాలంలో నాగన, కందన అనే సోదరులు ఈ ప్రాంతాన్ని ఏలేవారని, వారి పేరు మీదుగా దీనికి నాగన-కందనవోలు అని పేరు వచ్చిందని స్థానికులు చెబుతుంటారు. కాలక్రమంలో వ్యవహారికంలో ఆ పేరు కాస్తా నాగర్‌కర్నూల్‌గా రూపాంతరం చెందింది. చుట్టుపక్కల నల్లమల అడవులు, ప్రాజెక్టులతో అలరారే ఈ ప్రాంతం, స్వరాష్ట్రంలో జిల్లాగా అవతరించింది.

News February 20, 2026

MDK: ఇంటికి వచ్చిన రోజే మృతి

image

కౌడిపల్లి మండల పరిధిలోని రాజీపేటలో మంతరి సత్యనారాయణ (29) అనే యువకుడు అనారోగ్యంతో మృతి చెందాడు. గతంలో ప్రైవేట్ ఉద్యోగం చేసిన సత్యనారాయణ, రెండేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లో చికిత్స పొందారు. అనంతరం ఇంటికి వచ్చిన రోజే మృతి చెందడంతో తండ్రి శంకరయ్య కన్నీరుమున్నీరవుతున్నారు. తల్లి చిన్నప్పుడే మరణించగా, ఇప్పుడు పెద్ద కుమారుడు కూడా దూరమవ్వడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నిండింది.

News February 20, 2026

ఇవాళ కూడా నష్టాల్లోనే స్టాక్ మార్కెట్లు

image

అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలతో దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ కూడా నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 158పాయింట్లు కోల్పోయి 82,339 వద్ద, నిఫ్టీ 35పాయింట్లు నష్టపోయి 25,419 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, ఎటర్నల్, HCL టెక్, టీసీఎస్, అల్ట్రాటెక్ సిమెంట్, ఎయిర్‌టెల్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. నిన్న కూడా సెన్సెక్స్ వెయ్యి పాయింట్లకు పైగా నష్టపోవడంతో రూ.7 లక్షల కోట్ల సంపద ఆవిరైంది.