News February 11, 2025

నేడు అహోబిలం రానున్న హీరో సాయి దుర్గ్ తేజ్ 

image

ప్రముఖ పుణ్యక్షేత్రం అహోబిలం ఆలయ దర్శనార్థం మంగళవారం ఉదయం 10 గంటలకు హీరో సాయి దుర్గ్ తేజ్ వస్తున్నట్లు జనసేన పార్టీ సమన్వయకర్త మైలేరి మల్లయ్య తెలిపారు. ఆళ్లగడ్డ ప్రాంతంలోని అభిమానులు అహోబిలం క్షేత్రానికి వచ్చి ఆయన పర్యటనను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.

Similar News

News November 5, 2025

నేడు గిరి ప్రదక్షిణ చేస్తే..?

image

అరుణాచలంలోని అన్నామలై కొండను శివలింగంగా భావించి చేసే ప్రదక్షిణనే ‘గిరి ప్రదక్షిణ’ అంటారు. అయితే ఈ ప్రదక్షిణను కార్తీక పౌర్ణమి రోజున చేయడం వల్ల మరింత పుణ్యం వస్తుందని పండితులు చెబుతున్నారు. 14KM ఉండే ఈ గిరి చుట్టూ చెప్పులు లేకుండా ప్రదక్షిణ చేస్తే కోరిన కోర్కెలు నెరవేరి, ముక్తి లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. పున్నమి వెలుగులో ప్రదక్షిణ చేయడం శారీరక, మానసిక ఆరోగ్యానికి మంచిదని నమ్ముతారు.

News November 5, 2025

త్వరలో పెన్షన్లపై తనిఖీలు

image

TG: రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే చేయూత పింఛన్ల పంపిణీపై సామాజిక తనిఖీలు చేసేందుకు సెర్ప్ ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ స్కీమ్‌కు సంబంధించిన రికార్డులను సక్రమంగా నిర్వహించాలని ఎంపీడీవోలను ఆదేశించింది. ఈ మేరకు స్థానిక పంచాయతీ కార్యదర్శులు, మండల పింఛన్ ఇన్‌ఛార్జులకు సూచనలు ఇవ్వాలని పేర్కొంది. పెన్షన్ల పంపిణీ, చెల్లింపులో మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని స్పష్టంచేసింది.

News November 5, 2025

VKB: మినరల్ వాటర్ మాయజాలం.!

image

మినరల్ వాటర్ ప్లాంట్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. వాటర్ ప్లాంట్ యజమాన్యాలు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్స్ నిబంధనలు పాటించకుండా మాయజాలం చేస్తున్నారనే ఆరోపణలు వెలువడుతున్నాయి. కొడంగల్ నియోజకవర్గంలో జరుగుతున్న మినరల్ దందాపై అధికారుల పర్యవేక్షణ కరువైందనే విమర్శలు వెలువడుతున్నాయి. అనుమతులు లేకుండానే మినరల్ వాటర్ పేరుతో జనరల్ వాటర్‌ను ప్రజలకు సరఫరా చేస్తున్నారనే ఆరోపణలు వెలువడుతున్నాయి.