News January 25, 2026
నేడు ఆదిత్య హృదయం ఎందుకు పఠించాలి?

సూర్యారాధన వల్ల అసాధ్యమైన పనులు కూడా సుసాధ్యమవుతాయని నమ్మకం. రామాయణ యుద్ధంలో అలసిన రాముడికి అగస్త్యుడు ‘ఆదిత్య హృదయం’ బోధించారని పురాణాలు చెబుతున్నాయి. దీన్ని పఠిస్తే లభించిన శక్తితోనే రాముడు రావణుడిని సంహరించగలిగాడని నమ్ముతారు. అలాగే మయూరుడు అనే కవి సూర్యుని స్తుతించి కుష్టు వ్యాధి నుంచి విముక్తుడయ్యాడు. పాండవులు అరణ్యవాసంలో సూర్యుని అనుగ్రహంతోనే ‘అక్షయపాత్ర’ను పొంది అతిథి సత్కారాలు చేయగలిగారు.
Similar News
News February 27, 2026
తిరుపతి: ఇంటర్ పరీక్ష.. 181 మంది గైర్హాజరు

రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం హిస్టరీ, బోటనీ పరీక్షలు జరిగాయి. ఇందులో భాగంగా తిరుపతి జిల్లా వ్యాప్తంగా 58 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 2,146 మంది విద్యార్థులకు గాను 1,965 మంది పరీక్షకు హాజరైనట్లు RIO రాజశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా 181 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు ఆయన తెలియజేశారు.
News February 27, 2026
ALERT: ఎల్లుండి నుంచి కొత్త రూల్

ఇండియాలో మెసేజింగ్ యాప్‌లకు ‘సిమ్ బైండింగ్’ నిబంధన మార్చి 1 నుంచి అమలుకానుంది. దీనివల్ల మీ ఫోన్‌లో ఫిజికల్‌గా సిమ్ ఉంటేనే వాట్సాప్, టెలిగ్రామ్, సిగ్నల్ వంటి యాప్స్ పనిచేస్తాయి. ఈ గడువును పెంచేందుకు కేంద్రం నిరాకరించింది. అంతేకాకుండా ఇకపై కంప్యూటర్ లేదా వెబ్‌లో లాగిన్ అయిన వారు ప్రతి 6 గంటలకు ఒకసారి మళ్లీ అథెంటికేషన్ చేయాలి. లేదంటే ఆటోమేటిక్‌గా లాగ్ అవుట్ అవుతుంది.
News February 27, 2026
కాసేపట్లో మాజీ మావోలతో సీఎం రేవంత్ భేటీ

TG: ఇటీవల లొంగిపోయిన మాజీ మావోయిస్టు అగ్రనేతలతో సీఎం రేవంత్ కాసేపట్లో భేటీ కానున్నారు. వారిలో దేవ్‌జీ, మల్లా రాజిరెడ్డి, చంద్రన్న, సుజాతక్క, దామోదర్, నూనె నరసింహారెడ్డి ఉన్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావుతోపాటు డీజీపీ శివధర్ రెడ్డి, ఐజీ సుమతి కూడా పాల్గొంటున్నారు. ఇప్పటికే వీరంతా హైదరాబాద్‌లోని సచివాలయానికి చేరుకున్నారు.


