News January 16, 2026
నేడు ఆదిలాబాద్ జిల్లాకు సీఎం.. షెడ్యూల్ ఇదే

సీఎం రేవంత్ రెడ్డి నేడు ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. ఉ.10:30కి సీఎం నివాసం నుంచి బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుని, అక్కడి నుంచి హెలికాప్టర్‌లో ఆదిలాబాద్‌కు బయలుదేరనున్నారు. చనాక కొరటా పంప్ హౌస్ ప్రారంభించి నీటి విడుదల కార్యక్రమంలో పాల్గొని, అనంతరం నిర్మల్ జిల్లాకు వెళ్లి సదర్మట్ బ్యారేజీ ప్రారంభించి నీటిని విడుదల చేసిన తర్వాత నిర్మల్ మినీ స్టేడియంలో జరిగే బహిరంగ సభలో సీఎం పాల్గొంటారు.
Similar News
News February 20, 2026
చిత్తూరు: బావిలో పడి పోలీసు మృతి

చిత్తూరు జిల్లా యాదమరి (M) పట్రపల్లి సమీపంలో బావిలో పడి తమిళనాడు పోలీసు మృతి చెందాడు. మృతుడు తమిళనాడు రాష్ట్రం ఆంబూరు రూరల్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ గోపీనాథ్(39) గా గుర్తించారు. కుటుంబ కలహాల నేపథ్యంలో గోపీనాథ్ బావిలో పడి ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. తమిళనాడు పోలీస్ మృతిపై యాదమరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News February 20, 2026
Pax Silicaలోకి భారత్.. ఏంటీ కూటమి?

భారత్ ‘Pax Silica’ డిక్లరేషన్‌లో చేరింది. సెమీకండక్టర్ సప్లై చైన్, AI వంటి కీలక సాంకేతిక రంగాల్లో అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించడమే ఈ ఒప్పంద ఉద్దేశం. గ్లోబల్ చిప్ తయారీలో చైనా ఆధిపత్యాన్ని తగ్గించి, ప్రజాస్వామ్య దేశాల మధ్య సురక్షితమైన, నమ్మదగిన టెక్నాలజీ నెట్‌వర్క్‌ను నిర్మించాలని ఈ కూటమి లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నిర్ణయం ద్వారా భారత్ గ్లోబల్ సెమీకండక్టర్ హబ్‌గా ఎదిగేందుకు సహకారం అందనుంది.
News February 20, 2026
చిత్తూరు: హెల్ప్ లైన్ నెంబర్లు గుర్తుంచుకోవాలి

అత్యవసర సమయాలలో ఉపయోగపడే 112 (ఎమర్జెన్సీ నెంబర్), 1098 (చైల్డ్ హెల్ప్ లైన్) వంటి నెంబర్లను ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలని విద్యార్థులకు మహిళా పోలీస్ స్టేషన్ ఎస్ఐ కరీమున్నీసా సూచించారు. చిత్తూరు విద్యాశ్రమం పాఠశాలలో శుక్రవారం పలు అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థులను ఎవరైనా అసౌకర్యంగా తాగితే టీచర్లు, తల్లిదండ్రులకు చెప్పాలన్నారు.


