News October 15, 2024
నేడు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు వర్ష సూచన

ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా నేటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరానికి సమీపంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ప్రభావం వల్ల వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆయా జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెబుతూ ఉమ్మడి ఖమ్మం జిల్లాకూ హెచ్చరికలు జారీ చేసింది. ఈనెల 18 వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. SHARE IT
Similar News
News February 18, 2026
మధిర: ఇద్దరు హెచ్‌ఎంలపై వేటు

మధిరలో విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన ఇద్దరు ప్రధానోపాధ్యాయులపై జిల్లా విద్యాశాఖ క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. గర్ల్స్ హైస్కూల్ HM హైమావతిని వరంగల్ ఆర్జేడీకి సరెండర్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అదనపు కలెక్టర్ తనిఖీలో లోపాలు గుర్తించినట్లు సమాచారం. అలాగే ఎంపీపీఎస్ గర్ల్స్ స్కూల్ HM కెబిఎస్ రాజును వేంసూర్‌కు బదిలీ చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల అమలులో నిర్లక్ష్యం వల్లే ఈ చర్యలని డీఈవో జైని తెలిపారు.
News February 18, 2026
ఖమ్మం: వాహనాలకు రిఫ్లెక్టివ్ టేపులు తప్పనిసరి

ఖమ్మం (D)లో రోడ్డు ప్రమాదాల నివారణకు రవాణా శాఖ కఠిన చర్యలు చేపట్టింది. ఇకపై రాత్రి వేళల్లో వాహనాలు స్పష్టంగా కనిపించేలా రిఫ్లెక్టివ్ టేపులు, రియర్ మార్కింగ్ ప్లేట్లు తప్పనిసరి చేస్తూ కొత్త రూల్ తెచ్చింది. క్యూఆర్ కోడ్ లేని వాహనాలకు ఫిట్ నెస్ సర్టిఫికెట్లు జారీ చేయమని RTO జగదీష్ స్పష్టం చేశారు. రాత్రి సమయాల్లో నిలిపి ఉంచిన లారీల వల్ల జరుగుతున్న ప్రమాదాలను అరికట్టడమే ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశమన్నారు.
News February 18, 2026
ఖమ్మం: న్యాయవాది నుంచి కౌన్సిలర్‌గా

కోర్టులో కేసులు వాదించే స్థాయి నుంచి ప్రజల పక్షాన నిలిచే ప్రజాప్రతినిధిగా అడ్వకేట్ దండి శ్రీజ బాధ్యతలు చేపట్టారు. ఎదులాపురం మున్సిపాలిటీ 30వ వార్డు కౌన్సిలర్‌గా సీపీఐ తరపున విజయం సాధించి ప్రమాణ స్వీకారం చేశారు. గతంలో ఖమ్మం జిల్లాలో న్యాయవాదిగా సేవలందించిన శ్రీజ, ఇప్పుడు ప్రజలకు న్యాయం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతానని తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, మిత్రులు ఆమెను అభినందించారు.


