News April 15, 2025

నేడు ఉమ్మడి NZB జిల్లాకు ఎమ్మెల్సీ కవిత

image

ఎమ్మెల్సీ కవిత ఉమ్మడి NZB జిల్లాలో పర్యటించనున్నారు. మంగళవారం ఉదయం 10 గంటలకు కామారెడ్డి జిల్లా బాన్సువాడలో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సన్నాహక సమావేశంలో పాల్గొంటారు. అనంతరం బోధన్‌లో మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ వెంకటేశ్వర్ దేశాయి కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. సాయంత్రం 4 గంటలకు డిచ్‌పల్లిలో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభ సన్నాహక సమావేశంలో పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.

Similar News

News September 16, 2025

గుంటూరు: నేడు కోడెల వర్ధంతి

image

ప్రముఖ రాజకీయ నాయకుడు, నవ్యాంధ్ర తొలి సభాపతి, పల్నాటి పులిగా పేరుపొందిన కోడెల శివప్రసాదరావు 1947 మే 2న ఉమ్మడి గుంటూరు జిల్లా కండ్లగుంటలో జన్మించారు. డాక్టర్‌గా పని చేస్తూనే 1983లో టీడీపీలో చేరారు. 1983 నుంచి 2004 వరకు వరసగా 5సార్లు నరసరావుపేట నుంచి గెలిచారు. ఆయన పలు శాఖల మంత్రిగా పనిచేశారు. 2014లో గెలిచి నవ్యాంధ్ర తొలి శాసన సభాపతి అయ్యారు. 2019 సెప్టెంబరు 16న హైదరాబాదులో ఆయన స్వగృహంలో మరణించారు.

News September 16, 2025

మెదక్-సిద్దిపేట మార్గంలో రాకపోకలు పునరుద్ధరణ

image

మెదక్-సిద్దిపేట రహదారిపై నందిగామ వద్ద వర్షాలకు దెబ్బతిన్న కల్వర్టుకు ప్రత్యామ్నాయ మార్గాన్ని అధికారులు ఏర్పాటు చేశారు. దీంతో గత 20 రోజులుగా నిలిచిపోయిన రాకపోకలు తిరిగి ప్రారంభమయ్యాయి. కల్వర్టు దెబ్బతినడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు ప్రత్యామ్నాయ మార్గం సిద్ధం కావడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

News September 16, 2025

పరిటాల శ్రీరామ్‌కు 2+2 భద్రత

image

ధర్మవరం నియోజకవర్గ టీడీపీ సమయన్వయకర్త పరిటాల శ్రీరామ్‌కు భద్రత పెరగనుంది. 2+2 భద్రత కల్పించాలని ఏపీ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. వైసీపీ హయాంలో తన భద్రతను 1+1కు తగ్గించారని ఆయన కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. శ్రీరామ్ తరఫున లాయర్ గోళ్ల శేషాద్రి వాదనలు వినిపించగా కోర్టు ఏకీభవించింది. భద్రత పెంచాలని తీర్పు వెలువరించింది.