News January 30, 2025
నేడు ఎంజీఎంలో గుండె వైద్య శిబిరం

వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో గురువారం ఓ ప్రైవేట్ హాస్పిటల్ ఆధ్వర్యంలో సంయుక్తంగా పిల్లలకు గుండె పరీక్షల వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు. గుండె సంబంధిత సమస్యలు చిన్నారులకు ఉచితంగా 2డీ ఎకో పరీక్షలు నిర్వహిస్తారని, ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ పరీక్షలు కొనసాగుతాయన్నారు. జిల్లాలోని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డీఎంహెచ్ఓ సాంబశివరావు కోరారు.
Similar News
News February 22, 2026
రోజుకు 50 మెట్లు ఎక్కితే.. గుండె జబ్బులకు చెక్!

ఆఫీసులలో గంటల తరబడి కూర్చునే వారికి మెట్లెక్కడం ఒక మంచి ఎక్సర్‌సైజ్. రోజుకు కనీసం 50 మెట్లు ఎక్కితే గుండె జబ్బుల రిస్క్ 20% తగ్గుతుందని స్టడీస్ చెబుతున్నాయి. ఇది గుండె పంపింగ్ సామర్థ్యాన్ని వేగంగా పెంచుతుంది. మరోవైపు వేగంగా నడిస్తే మెటబాలిజం మెరుగుపడి డయాబెటిస్ కంట్రోల్‌లో ఉంటుంది. మెట్లెక్కడం కీళ్లపై ఒత్తిడి పెంచుతుంది. కీళ్ల నొప్పులు ఉన్నవారు నడవడం బెటర్. టైమ్ తక్కువున్నప్పుడు మెట్లెక్కాలి.
News February 22, 2026
సీసీ కెమెరాల నిఘా పెంచాలి: ఎస్పీ

రంజాన్ మాసం నేపథ్యంలో నంద్యాలలో సీసీ కెమెరాలు నిఘా మరింత పెంచాలని ఎస్పీ సునీల్ షోరాణ్ పోలీసులకు సూచించారు. శనివారం విజిబుల్ పోలింగ్‌లో భాగంగా నంద్యాలలోని పలు ప్రాంతాలలో ఆయన పర్యటించారు. బొమ్మలసత్రం, ఆర్టీసీ బస్టాండ్, భైర్మల్ విధి, శ్రీనివాస సెంటర్ తదితర ప్రాంతాల్లో పర్యటించి స్థానికులతో మాట్లాడారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే పోలీసుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.
News February 22, 2026
ఆముదపు విత్తులు ముత్యాలవుతాయా?

ఒక వస్తువు లేదా వ్యక్తి సహజ స్వభావం ఎప్పటికీ మారదు. ఆముదపు విత్తనాలు ఎప్పటికీ ఆముదపు విత్తనాలుగానే ఉంటాయి, అవి విలువైన ముత్యాలుగా మారవు. అలాగే దుర్మార్గులైన లేదా చెడ్డ స్వభావం కలిగిన వ్యక్తులు వారి ప్రవర్తనను మార్చుకోరని చెప్పడానికి.. సహజంగా జరగని లేదా అసాధ్యమైన విషయాల గురించి మాట్లాడేటప్పుడు ఈ సామెతను ఉపయోగిస్తారు.


