News October 4, 2025
నేడు ఎడపల్లిలో సద్దుల బతుకమ్మ…65 ఏళ్లుగా ఆనవాయితీ

పండగపూట ఇంట్లో ఆడపడుచులు వుంటే ఆనందం రెట్టింపు అవుతోందని ఆలస్యంగానైనా వారి సమక్షంలో పండగ జరుపుకోవాలనే సంప్రదాయం ఎడపల్లిలో ఆనవాయితీగా కొనసాగుతుంది. రాష్ట్రవ్యాప్తంగా దసరా పండగకు ముందు బతుకమ్మ పండగను నిర్వహిస్తారు. కానీ ఎడపల్లి మండల కేంద్రంలో మాత్రం అలా జరుపుకోరు. దసరా అనంతరం 5రోజులకు అంగరంగ వైభవంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. 65 ఏండ్లకు పైగా వస్తున్న ఆచారాన్ని నేటికీ కొనసాగిస్తున్నారు.
Similar News
News October 4, 2025
NZB: ఉమ్మడి జిల్లా స్థానిక ఎన్నికల్లో వారి తీర్పే కీలకం..!

స్థానిక సమరానికి తెర లేవడంతో ఉమ్మడి జిల్లాలోని అభ్యర్థుల తలరాతను మార్చే నిర్ణయాధికారం మాత్రం మహిళల చేతుల్లోనే ఉన్నది. NZB, KMR జిల్లాల్లో పురుషుల కన్నా మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. NZBజిల్లాలో పురుష ఓటర్ల సంఖ్య 3,96,778 మంది కాగా, మహిళలు 4,54,621 ఉన్నారు. ఇక KMR జిల్లాలో 3,07,508 మంది పురుషులు , 3,32,209 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఈ క్రమంలో రెండు జిల్లాల్లో మహిళల ఆశీస్సులు దక్కిన వారికే విజయం.
News October 3, 2025
ఎడపల్లి: మహిళ దారుణ హత్య..!

MHలోని కొండల్ వాడికి చెందిన లింగవ్వ (55)అనే మహిళను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేసి బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఘటన ఎడపల్లి మండలంలో చోటుచేసుకొంది. గత నెల 28న కనబడకుండా పోయిన ఆ మహిళ శవాన్ని గురువారం అర్థరాత్రి జైతాపూర్ కు చెందిన బాలకృష్ణ తన ఆటోలో తరలిస్తుండగా గ్రామస్తులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఆ శవం గోనెసంచులో చుట్టివుండడంతో పూర్తిగా కుళ్లిపోయింది. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
News October 3, 2025
క్రీడలు సానుకూలమైన దారిలో దిశానిర్దేశం చేస్తాయి:CP

క్రీడా కార్యక్రమాలు యువతకు సానుకూలమైన దారిలో దిశానిర్దేశం చేస్తాయని నిజామాబాద్ పోలీస్ కమీషనర్ సాయి చైతన్య అన్నారు. శుక్రవారం ఆయన క్రీడాపోటీల ముగింపులో మాట్లాడుతూ.. యువత దేశ భవిష్యత్తు అని, వారు ఆరోగ్యంగా ఉంటూ మంచి ఆశయాలతో, పట్టుదలతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కమీషనర్ క్రికెట్ ఆడి యువతలో ఉత్సాహం నింపారు.