News March 22, 2025
నేడు ఓర్వకల్లుకు పవన్ కళ్యాణ్ రాక

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ కర్నూలు జిల్లాకు రానున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని అధికారులను కలెక్టర్ రంజిత్ బాషా ఆదేశించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టే నీటి కుంటల పనులను ఓర్వకల్లు మండలం పూడిచర్లలో ప్రారంభించనున్నారు. అనంతరం బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించనున్నారు.
Similar News
News March 24, 2025
జనసేన పార్టీ ఆలూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా గుమ్మనూరు..?

జనసేన పార్టీ ఆలూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా మాజీ మార్కెట్ యార్డ్ ఛైర్మన్ గుమ్మానూరు నారాయణకు బాధ్యతలు అప్పగించే యోచనలో అధిష్ఠానం ఉన్నట్టు సమాచారం. విజయవాడలో ఆపార్టీ నేతలతో నారాయణ మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలో దూకుడైన యువనేత అవసరమని భావిస్తోన్న పార్టీ.. నారాయణకే బాధ్యతలు అప్పగించనున్నట్లు ప్రచారం సాగుతోంది. నియోజకవర్గంలో గుమ్మానూరు కుటుంబానికి బలమైన క్యాడర్ ఉన్న విషయం తెలిసిందే.
News March 24, 2025
ఫారంపాండ్ కుంటలకు కేరాఫ్ ఆలూరు

జాతీయ గ్రామీణ ఉపాధి పథకం ఫారంపాండ్ నీటి కుంటలకు కేరాఫ్ ఆలూరు. 2014 ఏడాదిలో టీడీపీ ప్రభుత్వం హయాంలో మండలంలోని పెద్దహోతూరు గ్రామం వద్ద పైలెట్ ప్రాజెక్టుగా వీటిని తవ్వించారు. వాటి ఉపయోగం గురించి అప్పట్లో రైతులకు అవగాహన సైతం కల్పించారు. ఈ ప్రాంతంలో నీటి కుంటలు విజయవంతమవడంతో రాష్ట్ర, దేశ వ్యాప్తంగా కుంటల తవ్వకాలు చేపట్టారు. ఇక్కడి ఉపాధి సిబ్బంది రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వీటిపై ట్రైనింగ్ ఇచ్చారు.
News March 24, 2025
వైభవంగా శ్రీమన్యాయసుధ మంగళ మహోత్సవం

ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం మంత్రాలయంలోని శ్రీ రాఘవేంద్రస్వామి మఠంలో పీఠాధిపతులు శ్రీ సుభుదేంద్రతీర్థుల ఆధ్వర్యంలో శ్రీమన్యాయసుధా మంగళ మహోత్సవం ఆదివారం వైభవంగా జరిగింది. పీఠాధిపతులు శ్రీ సుభుదేంద్ర తీర్థులు ఇతర మఠాల పీఠాధిపతులతో కలిసి దీప ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా గంధాన్ని శోభాయాత్ర చేశారు. వేదికపై శ్రీమన్యాయసుధ విద్యార్థుల అనువాదం అనంతరం అంతర్ దృష్టితో కూడిన వాఖ్యార్థ ఘోష్టి నిర్వహించారు.