News February 26, 2025
నేడు ఓర్వకల్లుకు ప్రముఖ లేడీ సింగర్ రాక

ఓర్వకల్లు మండలం కాల్వబుగ్గలోని శ్రీ భ్రమరాంబ సమేత బుగ్గ రామేశ్వర స్వామి ఆలయంలో బుధవారం శివరాత్రి పర్వదినం పురస్కరించుకొని ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత ఆధ్వర్యంలో నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ బ్రహ్మోత్సవాల్లో ప్రముఖ సింగర్ మధుప్రియ, పల్సర్ బైక్ ఝాన్సీ, రమేశ్ బృందం సందడి చేయనుంది. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
Similar News
News February 22, 2026
రాజమండ్రి: కలెక్టర్ ప్రకటన.. రేపు యథావిధిగా..

తూ.గో. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో “మీకోసం” కార్యక్రమం (ప్రజా సమస్యల పరిష్కార వేదిక), రెవెన్యూ క్లినిక్ సోమవారం యథావిధిగా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి ఆదివారం ఒక ప్రకటనలో తెలియజేశారు. డివిజన్, మండల స్థాయిలలో కూడా మీకోసం, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలు నిర్వహించబడతాయన్నారు. ఆయా ప్రాంతాల్లో ఆర్డీవోలు, తహశీల్దార్లు ఆయా ప్రధాన కార్యాలయం నుంచి హాజరావుతారని వెల్లడించారు.
News February 22, 2026
ఈనెల 23న ప్రజా సమస్యల పరిష్కార వేదిక: కలెక్టర్

పుట్టపర్తి కలెక్టరేట్‌లో ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక యథావిధిగా కొనసాగుతుందని కలెక్టర్ శ్యాం ప్రసాద్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టరేట్‌తో పాటు మండల, డివిజన్, మున్సిపాలిటీ కార్యాలయాలలోనూ ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. కలెక్టరేట్‌లో జరిగే పీజీఆర్ఎస్ కార్యక్రమానికి జిల్లా స్థాయి అధికారులు అందరూ తప్పనిసరిగా హాజరు కావాలని తెలిపారు.
News February 22, 2026
BELలో మేనేజ్‌మెంట్ ఇండస్ట్రీయల్ ట్రైనీ పోస్టులు

చెన్నైలోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(<


