News April 11, 2024
నేడు కడపకు కొండా రాఘవరెడ్డి.. షర్మిలపై కీలక ప్రెస్ మీట్

వైఎస్ షర్మిల ముఖ్య అనుచరుడు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ వ్యవస్థాపకుడు కొండా రాఘవరెడ్డి నేడు కడపకు రానున్నారు. తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేసి షర్మిల చేసిన అన్యాయంపై కడపలో ఆయన కీలక మీడియా సమావేశం నిర్వహించనున్నారు. తెలంగాణలో వైఎస్ఆర్ కాంగ్రెస్ తెలంగాణ పార్టీ పేరిట వైఎస్ షర్మిల చేసిన మోసం అక్రమాలపై ఈరోజు నుంచి ఆయన రాష్ట్రంలో పర్యటించి ప్రజలకు తెలుపనున్నట్లు ఆయన వర్గీయులు తెలిపారు.
Similar News
News April 11, 2025
ఒంటిమిట్ట రామదాసు ఈయనే..

భద్రాచలంలో రాములోరికి గుడి నిర్మించి రామదాసు చరిత్రలో నిలిచిపోయారు. ఒంటిమిట్ట రామాలయానికి ఆ స్థాయిలోనే కృషి చేశారు వావిలికొలను సుబ్బారావు. 1863 జనవరి 23న ప్రొద్దుటూరులో జన్మించిన ఆయన ఆలయ జీర్ణోద్ధరణకు శ్రీకారం చుట్టారు. ఇందుకోసం టెంకాయ చిప్ప చేత పట్టి ఆంధ్ర రాష్ట్రంలో ఊరూరా తిరిగారు. భిక్షంగా వచ్చిన నగదును ఆలయ అభివృద్ధికి ఖర్చు చేశారు. 1936, ఆగస్టు 1న మద్రాసులో కన్నుమూశారు.
News April 11, 2025
ఒంటిమిట్ట కళ్యాణోత్సవం.. భారీ బందోబస్తు

ఒంటిమిట్ట సీతారామ కళ్యాణ మహోత్సవానికి శుక్రవారం సాయంత్రం సీఎం చంద్రబాబు హాజరు కానున్న నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ వెల్లడించారు. నలుగురు ఏఎస్పీలు, 25 మంది డీఎస్పీలు, 73 మంది సీఐలు, 177 మంది ఎస్ఐలు, 1700 మంది ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్, హోం గార్డులు బందోబస్తులో పాల్గొంటున్నట్లు పేర్కొన్నారు.
News April 11, 2025
సీఎం పర్యటన ట్రయల్ రన్.. నిలిచిపోయిన ట్రాఫిక్

సీఎం కడప జిల్లా పర్యటన కోసం గురువారం ట్రయల్ రన్ నిర్వహించారు. దీంతో మూడు గంటల పాటు ట్రాఫిక్ నిలిపివేశారని ప్రయాణికుల ఆరోపించారు. తిరుపతి నుంచి కడపకు వచ్చే మార్గంలో పెద్దఎత్తున వాహనాలు నిలిచిపోయాని పేర్కొన్నారు. ఒంటిమిట్టకు సీఎం రానున్న నేపథ్యంలో పోలీస్ అధికారులు ఈ కార్యక్రమం చేపట్టారు. రాములోరికి ఆయన పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పిస్తారు.