News February 24, 2025
నేడు కరీంనగర్‌కు సీఎం

ఉమ్మడి KNR, MDK, NZB, ADB పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నేపథ్యంలో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి కరీంనగర్‌కు రానున్నారు. ఉదయం 11 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి బయలుదేరి నిజామాబాద్, మంచిర్యాలలో ప్రచారం ముగించుకుని సాయంత్రం 4 గంటల వరకు కరీంనగర్ చేరుకుంటారు. SRR కళాశాల మైదానంలో జరిగే పట్టభద్రుల సమావేశానికి హాజరవుతారు.
Similar News
News November 9, 2025
విశాఖ కలెక్టరేట్‌లో రేపు జరగబోయే PGRS రద్దు

విశాఖ కలెక్టరేట్‌లో రేపు జరగబోయే పీజీఆర్ఎస్‌ను రద్దు చేసినట్లు కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ తెలిపారు. జిల్లా అధికార యంత్రాంగం CII పార్ట్‌నర్ షిప్ సమ్మిట్ ఏర్పాట్లలో ఉన్నందున PGRSను తాత్కాలికంగా రద్దు చేశామన్నారు. అర్జీదారులు ఈ విషయాన్ని గమనించాలని కలెక్టర్ కోరారు. నవంబర్ 17వ తేదీన PGRS యథావిధిగా నిర్వహిస్తామని చెప్పారు.
News November 9, 2025
10న ఏలూరుకు కేంద్ర బృందం: కలెక్టర్

మొంథా తుఫాన్ నష్టాల పరిశీలనకు కేంద్ర బృందం ఈ నెల 10న ఏలూరు జిల్లాలో పర్యటించనుందని కలెక్టర్ వెట్రిసెల్వి ఆదివారం తెలిపారు. 10వ తేదీ సాయంత్రం 4 గంటలకు బృందం ఉంగుటూరు చేరుకుంటుంది. క్షేత్రస్థాయిలో నష్టాన్ని పరిశీలించి, పునరుద్ధరణ పనులపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను సమీక్షిస్తుందని కలెక్టర్ పేర్కొన్నారు.
News November 9, 2025
NFUకు భారత్ కట్టుబడి ఉంది : రాజ్‌నాథ్ సింగ్

భారత్ ఏ దేశంపైనా ముందుగా అణు దాడి చేయకూడదనే NFU (No First Use) సూత్రానికి కట్టుబడి ఉందని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. దాడి చేస్తే మాత్రం ప్రతీకారం తీర్చుకుంటుందని తెలిపారు. పొరుగు దేశాల కవ్వింపు చర్యలకు భయపడబోమన్నారు. అనేక దేశాలు అణ్వాయుధాలను పరీక్షిస్తూనే ఉన్నాయని US అధ్యక్షుడు ట్రంప్ చేసిన కామెంట్లపై ఆయన స్పందించారు. సంయమనం, సంసిద్ధత రెండింటిపై భారత్ ఆధారపడి ఉంటుందన్నారు.


