News February 24, 2025

నేడు కరీంనగర్‌కు సీఎం

image

ఉమ్మడి KNR, MDK, NZB, ADB పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నేపథ్యంలో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి కరీంనగర్‌కు రానున్నారు. ఉదయం 11 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి బయలుదేరి నిజామాబాద్, మంచిర్యాలలో ప్రచారం ముగించుకుని సాయంత్రం 4 గంటల వరకు కరీంనగర్‌ చేరుకుంటారు. SRR కళాశాల మైదానంలో జరిగే పట్టభద్రుల సమావేశానికి హాజరవుతారు.

Similar News

News September 17, 2025

జాతీయ పతాకాన్ని ఎగరవేసిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య

image

జనగామ పట్టణ కేంద్రంలోని కలెక్టరేట్ లో ప్రజా పాలన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య హాజరై జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. 60 ఏళ్ల స్వీయ అస్తిత్వం కోసం ఉద్యమించి స్వరాష్ట్రంగా అవతరించిన తెలంగాణ నేడు అభివృద్ధి పథంలో ముందుకు కొనసాగుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని వర్గాల వారికి న్యాయం జరుగుతుందని తెలిపారు.

News September 17, 2025

బొబ్బిలి ప్రభుత్వ ఐటీఐలో అడ్మిషన్లకు దరఖాస్తుల ఆహ్వానం

image

బొబ్బిలి ప్రభుత్వ ఐటీఐలో ఖాళీ సీట్లు భర్తీకి దరఖాస్తులు చేసుకోవాలని ప్రిన్సిపల్ బలగ పోతయ్య తెలిపారు. ఈనెల 27లోగా iti.ap.gov.in వెబ్సైట్‌లో టెన్త్, స్టడీ సర్టిఫికేట్స్, ఆధార్, కుల ధ్రువీకరణ పత్రాలతో ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న వారు 28న సర్టిఫికేట్స్ వేరిఫికేషన్‌కు ఒరిజినల్ సర్టిఫికేట్స్, అన్ని పత్రాలతో రావాలన్నారు. >Share it

News September 17, 2025

పాకిస్థాన్‌తో మ్యాచ్.. యూఏఈ బౌలింగ్

image

ఆసియాకప్‌లో పాకిస్థాన్ ఆడటంపై ఎట్టకేలకు సస్పెన్స్ వీడింది. యూఏఈతో మ్యాచులో టాస్ కోసం ఆ జట్టు కెప్టెన్ సల్మాన్ మైదానంలోకి వచ్చారు. టాస్ గెలిచిన యూఏఈ బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచులో గెలిచిన జట్టు సూపర్-4 చేరనుంది.