News July 19, 2024
నేడు కర్నూలులో జడ్పీ సమావేశం

కర్నూలులో నేడు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జరగనుంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత జరుగుతున్న తొలి జడ్పీ సమావేశం ఇది. జిల్లాకు మినీ అసెంబ్లీ లాంటి ఈ సమావేశానికి సమావేశానికి మంత్రులతోపాటు ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు. జిల్లాలో నెలకొన్న ప్రధాన సమస్యలు, వివిధ శాఖలకు రావాల్సిన నిధులు, పేరుకుపోయిన బకాయిలపై చర్చ జరిగే అవకాశం ఉంది.
Similar News
News December 18, 2025
సీఎం చంద్రబాబుకు అవార్డు ఏపీకి గర్వకారణం: మంత్రి టీజీ

సీఎం చంద్రబాబుకు బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు మంత్రి టీజీ భరత్. ఈ అవార్డు రావడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ‘దార్శనికత విశ్వాసాన్ని సృష్టిస్తుంది. విశ్వాసం పెట్టుబడులను ఆకర్షిస్తుంది. పెట్టుబడి ఉద్యోగాలను సృష్టిస్తుంది’ అంటూ భరత్ ట్వీట్ చేశారు. ఏపీకి ఇది గర్వకారణమైన క్షణం అన్నారు. సీఎం చంద్రబాబు బలమైన నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధిలో ముందుకెళ్తుందన్నారు.
News December 18, 2025
ప్రతి పాఠశాలలో వారం రోజులు వేడుకలు: డీఈవో

కర్నూలు జిల్లాలో ఈనెల 18 నుంచి 24 వరకు అన్ని ఉన్నత పాఠశాలల్లో జాతీయ వినియోగదారుల దినోత్సవ వేడుకలు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి ఎల్.సుధాకర్ తెలిపారు.19న ఏపీజే అబ్దుల్ కలాం మునిసిపల్ హైస్కూల్‌లో 8, 9వ తరగతి విద్యార్థులకు డ్రాయింగ్, ఎలక్యూషన్ పోటీలు జరగనున్నాయి. విజేతలకు రూ.5 వేల వరకు బహుమతులు అందజేస్తారు.
News December 17, 2025
‘జిల్లాలో రబీకి యూరియా కొరత లేదు’

కర్నూలు జిల్లాలో రబీ సీజన్‌కు యూరియా ఎరువులు సమృద్ధిగా ఉన్నాయని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పి. వరలక్ష్మి తెలిపారు. జిల్లాకు మొత్తం 24,580 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా, ప్రస్తుతం 8,487 మెట్రిక్ టన్నుల స్టాక్ అందుబాటులో ఉండగా, డిసెంబర్ చివరికి మరింత యూరియా రానుందని చెప్పారు. రైతులు ఎంఆర్పీ ధరలకే ఎరువులు కొనుగోలు చేసి రశీదు తీసుకోవాలని సూచించారు.


