News November 17, 2025
నేడు కర్నూలులో PGRS

ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమాన్ని ఈ నెల 17న (సోమవారం) నిర్వహిస్తున్నట్లు కర్నూలు జిల్లా కలెక్టర్ ఏ. సిరి తెలిపారు. కర్నూలు కలెక్టరేట్ ప్రాంగణంలోని సునయన ఆడిటోరియంలో ఈ కార్యక్రమం జరగనుంది. జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండల, మున్సిపల్, డివిజన్ స్థాయిలోనూ ఈ వేదిక జరుగుతుందని, ప్రజలు వినియోగించుకోవాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.
Similar News
News April 2, 2026
చేనేతలకు ఉచిత విద్యుత్ కరపత్రాల విడుదల

రాష్ట్ర ప్రభుత్వం చేనేతలకు 200 యూనిట్లు, పవర్లూమ్ యూనిట్లకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నట్లు కలెక్టర్ డా.ఏ.సిరి తెలిపారు. కలెక్టరేట్‌లో కరపత్రాలు విడుదల చేసి, లబ్ధిదారులకు ధృవపత్రాలు అందజేశారు. జిల్లాలో 2,457 కుటుంబాలకు ఈ పథకం నుంచి ప్రయోజనం చేకూరుతుందన్నారు. విద్యుత్ భారం తగ్గడం వల్ల వారి జీవనోపాధి మెరుగుపడుతుందని ఆమె పేర్కొన్నారు.
News April 2, 2026
ప్రభుత్వ ఆస్పత్రి ప్రసవాల్లో కర్నూలు జిల్లాకు అగ్రస్థానం

ప్రభుత్వ ఆస్పత్రుల్లో అత్యధిక ప్రసవాలు నిర్వహించి కర్నూలు జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానం సాధించిందని కలెక్టర్ డా.ఏ.సిరి తెలిపారు. 2025 ఏప్రిల్ నుంచి 2026 ఫిబ్రవరి వరకు 5,500 ప్రసవాల లక్ష్యం కాగా, 145 శాతంతో 7,982 ప్రసవాలు జరిగాయని పేర్కొన్నారు. లక్ష్యానికి మించి సేవలందించడంలో జిల్లా టాప్‌లో నిలిచిందన్నారు. మెరుగైన వైద్య సేవలు అందడం వల్లే ఈ రికార్డు సాధ్యమైందని ఆమె వివరించారు.
News April 2, 2026
కర్నూలు: పరీక్షలు రద్దు

రికార్డ్ అసిస్టెంట్-1, ఫ్రంట్ ఆఫీస్ కో-ఆర్డినేటర్-1 పోస్టులకు ఈ ఏడాది ఫిబ్రవరి 18న నిర్వహించిన రాత పరీక్షలను హైకోర్టు ఆదేశాల మేరకు రద్దు చేస్తున్నట్లు కర్నూలు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షులుడు జి.కబర్థి తెలిపారు. త్వరలో మళ్లి రాత పరీక్షల తేదీని ప్రకటిస్తామని పేర్కొన్నారు. త్వరలో జిల్లా కోర్టు వెబ్‌సైట్‌లో పొందుపరుస్తామని చెప్పారు.


