News September 18, 2024

నేడు కర్నూలు జిల్లా ఎమ్మెల్యేలతో సీఎం సమావేశం

image

అమరావతిలో ఇవాళ మధ్యాహ్నం ఎన్డీఏ శాసన సభాపక్ష సమావేశం జరగనుంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, BJP రాష్ట్ర అధ్యక్షురాలు పురందీశ్వరి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, NMD ఫరూక్, టీజీ భరత్, ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు. 100 రోజుల పాలన, MLAల పనితీరుపై సమీక్షించి, భవిష్యత్ కార్యాచరణపై ఎమ్మెల్యేలకు సీఎం దిశా నిర్దేశం చేయనున్నారు.

Similar News

News January 9, 2025

కర్నూలు: పోక్సో కేసులో మూడేళ్లు జైలు శిక్ష

image

పదేళ్ల బాలికకు అసభ్యకర ఫొటోలు చూపిస్తూ లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో కర్నూలు బుధవారపేటకు చెందిన బొగ్గుల రాజేశ్‌కు జిల్లా స్పెషల్ పోక్సో కోర్టు మూడేళ్లు జైలు శిక్ష, రూ.20 వేలు జరిమానా విధించింది. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు 2021 జూన్‌లో కర్నూలు మూడో పట్టణ పోలీసు స్టేషన్లో పోక్సో కేసు నమోదు చేశారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన జడ్జి పై విధంగా తీర్పునిచ్చారు.

News January 9, 2025

ఇస్తేమా ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ

image

ఆత్మకూరు కేంద్రంగా 3 రోజుల పాటు జరిగిన ఇస్తేమా కార్యక్రమంలో భాగంగా చివరి రోజైనా గురువారం వేడుక ముగుస్తున్న సందర్భంగా నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా అక్కడి ఏర్పాట్లను పరిశీలించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారు తిరుగు ప్రయాణంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీస్ శాఖ తరపున కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ప్రత్యేకించి ట్రాఫిక్ సమస్య వాటిల్లకుండా బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించారు.

News January 9, 2025

పవన్ కళ్యాణ్ కర్నూలు జిల్లా పర్యటన రద్దు

image

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేటి కర్నూలు జిల్లా పర్యటన రద్దయింది. తిరుపతి బైరాగిపట్టెడలో చోటు చేసుకున్న తొక్కిసలాటలో ఆరుగురు ప్రాణాలు కోల్పోవడంతో ఆయన జిల్లా పర్యటనను రద్దు చేసుకున్నారు. త్వరలోనే మళ్లీ జిల్లాలో పర్యటించే అవకాశం ఉంది.