News November 18, 2024
నేడు కలెక్టరేట్‌లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక

చిత్తూరు కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. ఉ.9.30 గం.ల నుంచి మ.1 గం.వరకు కలెక్టరేట్‌లోని నూతన సమావేశపు మందిరంలో ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధికారులు తప్పక హాజరుకావాలని ఆదేశించారు. ప్రజలు వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు.
Similar News
News February 20, 2026
చిత్తూరు: హెల్ప్ లైన్ నెంబర్లు గుర్తుంచుకోవాలి

అత్యవసర సమయాలలో ఉపయోగపడే 112 (ఎమర్జెన్సీ నెంబర్), 1098 (చైల్డ్ హెల్ప్ లైన్) వంటి నెంబర్లను ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలని విద్యార్థులకు మహిళా పోలీస్ స్టేషన్ ఎస్ఐ కరీమున్నీసా సూచించారు. చిత్తూరు విద్యాశ్రమం పాఠశాలలో శుక్రవారం పలు అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థులను ఎవరైనా అసౌకర్యంగా తాగితే టీచర్లు, తల్లిదండ్రులకు చెప్పాలన్నారు.
News February 20, 2026
ద్రవిడ వర్సిటీకి పెరిగిన గ్రాంట్

కుప్పంలోని ద్రవిడ విశ్వవిద్యాలయానికి TTD నుంచి అందుతున్న వార్షిక నిర్వహణ గ్రాంట్‌ను ప్రభుత్వం పెంచింది. ఇప్పటి వరకు రూ.50 లక్షలు అందుతుండగా, 2024-25 ఆర్థిక సంవత్సరం నుంచి దాన్ని రూ.1 కోటికి పెంచింది. TTD బోర్డు తీర్మానం మేరకు ఈ పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ నిర్ణయంతో విశ్వవిద్యాలయ అభివృద్ధి, మౌలిక సదుపాయాల బలోపేతానికి తోడ్పాటు లభించనుంది.
News February 19, 2026
మదనపల్లెలో బాలిక హత్య.. నిందితుడి తల్లిపైనా కేసు

మదనపల్లెలో బాలికపై హత్యాచారం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు వన్ టౌన్ పోలీసులు నిందితుడి తల్లిపై కేసు నమోదు చేశారు. A1గా కులవర్ధన్‌ను, A2గా అతడి తల్లి అంజలిని పేర్కొన్నారు. అంజలిపై హత్య, హత్యా నేరం తారుమారు, హత్య జరిగిన సమాచారాన్ని పోలీసులకు చెప్పకపోవడం వంటి అభియోగాలపై కేసు నమోదు చేశామని DSP మహేంద్ర ప్రకటించారు. ఆమె కోసం గాలిస్తున్నామని తెలిపారు.


