News February 10, 2025
నేడు కలెక్టరేట్‌లో ప్రజా విజ్ఞప్తుల స్వీకరణ

నంద్యాలలోని కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుంచి విజ్ఞప్తులను స్వీకరించనున్నట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9:30 గంటలకు జరిగే ఈ కార్యక్రమానికి ఆయా శాఖల అధికారులు హాజరు కావాలని సూచించారు. ప్రజలు కూడా సమస్యలపై అర్జీల రూపంలో ఇవ్వాలని కోరారు.
Similar News
News March 1, 2026
లక్ష్మణ్ హత్య.. దర్యాప్తు ముమ్మరం

కరకగూడెం మండలం అశ్వాపురపాడు గ్రామానికి చెందిన కోవాసి లక్ష్మణ్ హత్య కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఏడూళ్ల బయ్యారం సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై పీవీఎన్ రావు ఆదివారం ఘటనాస్థలాన్ని సందర్శించి కీలక ఆధారాలు సేకరించారు. హత్యకు దారితీసిన కారణాలపై గ్రామస్థుల నుంచి వాంగ్మూలాలను నమోదు చేశారు. ఈ హత్య వెనుక ఉన్న అసలు కారణాలను వెలికితీసేందుకు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు.
News March 1, 2026
ఖమ్మం: ఆ 32 ఎకరాల భూదాన్ భూములు ఎక్కడ?

ఖమ్మం వెలుగుమట్ల భూదాన్ భూముల వ్యవహారం సంచలనం సృష్టిస్తోంది. కాగా ఈ భూములు రికార్డుల్లో మొత్తం 62 ఎకరాలు ఉండగా.. ఇందులో 32 ఎకరాలు బడాబాబుల చేతుల్లో ఉన్నాయి. కాగా బడా బాబుల చేతిలో ఉన్న భూములను స్వాధీనం చేసుకోవాల్సి ఉండగా, వాటిపై ప్రభుత్వం మౌనం వహిస్తుందని ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం భూదాన్ భూములు 30 ఎకరాలే ఉండగా.. మిగిలిన 32 ఎకరాల భూముల లెక్కలు తేల్చాలని డిమాండ్ వినిపిస్తుంది.
News March 1, 2026
ఖమ్మం చేరుకున్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజ్ పేయి శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ఆదివారం ఖమ్మం చేరుకున్నారు. స్థానిక రైల్వే స్టేషన్‌లో ఆయనకు శత జయంతి ఉత్సవ కమిటీ సభ్యులు గోంగూర వెంకటేశ్వర్లుతో పాటు బీజేపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. అనంతరం ఖమ్మం ఎస్ఆర్ గార్డెన్స్‌లో నిర్వహించిన వాజ్ పేయి శత జయంతి వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.


